Nokia 2 స్పెసిఫికేషన్స్ ఇవే..?

హెచ్‌ఎండి గ్లోబల్ నుంచి మరికొద్ది రోజుల్లో లాంచ్ కాబోతోన్న ఎంట్రీలెవల్ నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ Nokia 2కు సంబంధించి పలు ఫోటోలు లీక్ అయ్యాయి. యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ నుంచి ఈ ఫోటోలు లీక్ అవ్వటం విశేషం.

Read More : సెప్టంబర్ 22 నుంచి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ప్రీ-ఆర్డర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4000mAh బ్యాటరీతో..

నోకియా 2కు సంబంధించి ఈ సంస్థ నుంచి బయటకొచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం నోకియా 2 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 4000mAh బ్యాటరీతో రాబోతోంది. 5 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 202 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఫీచర్లను ఈ ఫోన్ క్యారీ చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.8000 కంటే తక్కువగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నోకియా 6 vs రెడ్‌మి నోట్ 4

నోకియా 6 రాకతో ఒక్కసారిగా మార్కెట్ వేడిక్కింది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉన్న రెడ్‌మి నోట్ 4, మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు నోకియా 6 ప్రధాన సవాల్‌గా నిలిచింది. నోకియా 6, మోటో జీ5 ప్లస్ ఫోన్‌ల మధ్యగల తేడాలను విశ్లేషిస్తూ Spec Comparison స్టోరీని కొద్ది రోజులకు క్రితమే గిజ్‌బాట్ బృందం పోస్ట్ చేయటం జరిగింది. తాజాగా, నోకియా 6, రెడ్‌మి నోట్ 4 మధ్యగల తేడాలను విశ్లేషిస్తూ మరో ఆసక్తికర కధనాన్ని పాఠకుల ముందుకు తీసుకురావటం జరగుతోంది...

నోకియా 6 డిజైన్

డిజైన్ విషయానికి వచ్చేసరికి నోకియా 6 ఫోన్ 6000 సిరీస్ సాలిడ్ అల్యూమినియమ్ గ్రేడ్ మెటల్ తో క్రాఫ్ట్ కాబడింది. నోకియా 6 రెగ్యులర్ వేరియంట్ matte ఫినిషింగ్ తోనూ, ఆర్టీ బ్లాక్ వేరియంట్ glossy ఫినిషింగ్ తోనూ డిజైన్ కాబడ్డాయి. ఫోన్ చుట్టుకొలత వచ్చేసరికి 154 x 75.8 x 8.4మిల్లీ మీటర్లు, బరువు 165 గ్రాములు.

రెడ్‌మి నోట్ 4 డిజైన్

రెడ్‌మి నోట్ 4 డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి, ఈ ఫోన్ ఒంపులతో కూడిన యునిబాడీ అల్యూమినియమ్ షెల్‌తో వస్తోంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ రెడ్మీ నోట్ 3నే ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో అమర్చారు, ముందు భాగంలో మూడు టచ్ సెన్సిటివ్ బటన్లు ఉంటాయి. డివైస్ చుట్టుకొలత వచ్చేసరికి 151 x 76 x 8.5మిల్లీ మీటర్లు, బరువు 165 గ్రాములు.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి.

నోకియా 6 అలానే రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లు మోడల్ సమానమైన 5.5 అంగుళాల 2.5డి కర్వుడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. రిసల్యూషన్ సామర్థ్యం (1920 x 1080పిక్సల్స్).

నోకియా 6 ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

నోకియా 6 మోడల్ 1.4గిగాహెట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌తో వస్తోంది. ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేసేందుకు గాను ప్రాసెసర్‌కు అడ్రినో 505 జీపీయూను అనుసంధానించారు. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే నోకియా 6 ఫోన్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకోవచ్చు.

రెడ్‌మి నోట్ 4 ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

రెడ్‌మి నోట్ 4 ఫోన్ 2.0 GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్‌తో వస్తోంది. ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేసేందుకు గాను ప్రాసెసర్‌కు అడ్రినో 505 జీపీయూను అనుసంధానించారు. ఇక ర్యామ్, స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే రెడ్‌మి నోట్ 4 టాప్-ఎండ్ వేరియంట్ 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి

నోకియా 6 ఆండ్రాయడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇదే సమయంలో రెడ్‌మి నోట్ 4 పాత వర్షన్ ఆండ్రాయిడ్ 6.0 మార్షమల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది. నోకియా 6ను ఎంపిక చేసుకోవటం ద్వారా ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందే వీలుంటుంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

నోకియా మోడల్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఈ కెమెరాలలో పొందుపరిచిన f/2.0 అపెర్చుర్ లెన్స్, డ్యుయల్ టోన్ ఫ్లాష్‌లు క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. రెడ్‌మి నోట్ 4 కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కెమెరాలలో పొందుపరిచిన f/2.0 అపెర్చుర్ లెన్స్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, డ్యుయల్ టోన్ ఫ్లాష్‌లు క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి.

బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి నోకియా 6 కేవలం 3000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి నోట్ 4 శక్తివంతమైన 4100 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. కనెక్టువిటీ అంశాలను పరిశీలించినట్లయితే.. ఈ రెండు ఫోన్‌లు 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లతో వస్తున్నాయి. నోకియా 6 ఫోన్ కు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్ మరొక అడ్వాంటేజ్.

ధర విషయానికి వచ్చేసరికి...

మార్కెట్లో రెడ్మీ నోట్ 4 (4జీబి ర్యామ్ + 64జీబి వేరియంట్) రూ.12,999 ధర ట్యాగ్‌తో మార్కెట్లో దొరుకుతోంది. ఇక నోకియా 6 విషయానికి వచ్చేసరికి సేల్ జూలైలో ప్రారంభమవుతుంది. రూ.14,999 ధర ట్యాగ్‌తో లభ్యమయ్యే ఈ ఫోన్‌లను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 2 Likely to Pack a Massive 4000mAh Battery and Snapdragon 212 SoC. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot