నోకియాతో Airtel జట్టు, రూ. 4999కే నోకియా 2 స్మార్ట్‌ఫోన్

Written By:

Itel, Samsung, Celkon, and Intex తర్వాత ఎయిర్‌టెల్ HMD Global నోకియాతో జట్టు కట్టింది. నోకియా ఫోన్లపై భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. మేరా పెహ్లే స్మార్ట్‌ఫోన్ పేరుతో Airtel ఈ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా నోకియా 3, నోకియా 2 ఫోన్లపై రూ. 2 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ యూజర్లకు కేవలం రూ. 4999కే రానుంది. కాగా నోకియా ఫోన్ అసలు ధర ఇప్పుడు మార్కెట్లో రూ. 6999గా ఉంది. నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌ ధర కూడా 7,499 రూపాయలకు దిగొచ్చింది. అయితే దీనిలో కూడా కొన్ని షరతులను పెట్టింది.

బడ్జెట్ ధరలో మరో రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు, జియో ఆఫర్లతో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్‌ 169 రూపాయల ప్యాక్‌

నోకియా ఫోన్లను కొనుగోలుచేసిన వారికి ఎయిర్‌టెల్‌ 169 రూపాయల ప్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ద్వారా యూజర్లు రూ. 2000 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందనున్నారు. ఇలా పొందిన మొత్తాన్ని కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ రెండు వాయిదాల్లో ఆఫర్‌ చేయనుంది.

తొలిసారి 18 నెలల కాలంలో

తొలిసారి 18 నెలల కాలంలో 500 రూపాయలను అందివనుంది. మిగతా మొత్తం అంటే 1500 రూపాయలను 36 నెలలో చెల్లించనుంది. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు తమ సిమ్‌ కార్డుపై 18 నెలల కాలంలో కనీసం 3500 రూపాయల రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

మరో 19 నుంచి 36 నెలల కాలంలో..

మరో 19 నుంచి 36 నెలల కాలంలో మరో 3500 రూపాయలతో రీఛార్జ్‌ చేసుకోవాలి. ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ.169 ప్రీపెయిడ్‌ ప్యాక్‌పై రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉండనున్నాయి.

జియో కూడా ఆఫర్

కాగా ఇప్పటికే దీనిపై జియో కూడా ఆఫర్ అందిస్తోంది. నోకియా 2 స్మార్ట్‌ఫోన్‌పై రిలయన్స్ జియో 45 జీబీ అదనపు డేటాను అందిస్తున్నది. 9 నెలల పాటు నెలకు 5జీబీ చొప్పున ఈ డేటా లభిస్తుంది. అయితే యూజర్లు అందుకు గాను రూ.309 ఆపైన విలువ గల ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు వారికి అందుబాటులో ఉంటుంది.

నోకియా 2

ఈ ప్లాన్లతో నోకియా 2 ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు అందులో ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేయడం మంచిది.
నోకియా 2 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 52 స్ప్లాష్ ప్రూఫ్ టెక్నాలజీ, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.

నోకియా 3 స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

అప్పట్లో లాంచ్ ఆఫర్ క్రింద

అప్పట్లో లాంచ్ ఆఫర్ క్రింద నోకియా 3 ఫోన్‌లను కొనుగోలు చేసిన వొడాఫోన్ యూజర్లకు మూడు నెలల పాటు రూ.149కే 5జీబి డేటాను అందించింది. అలానే Makemytrip.com బుకింగ్స్ పై రూ.1800 వరకు తగ్గింపు, డొమెస్టిక్ ఫ్లైట్స్ పై రూ.700 వరకు తగ్గింపును అందించింది. మరి అవి ఇప్పుడు కస్టమర్లు ఈ ఫోన్ కొనుగోలు సమయంలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 2 and Nokia 3 Buyers Can Now Get Rs. 2,000 Cashback From Airtel More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot