నోకియా స్మార్ట్‌ ఫోన్స్ ఎన్8, ఎన్9 రివ్యూ

Posted By: Staff

నోకియా స్మార్ట్‌ ఫోన్స్ ఎన్8, ఎన్9 రివ్యూ

స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడంలో నోకియా ఒకరకంగా వెనుకబడిందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నరోజుల్లో ఎవరైనా ఒక స్మార్ట్ ఫోన్‌ని వాడుతున్నారంటే వారు దానిని చాలా గర్వంగా ఫీల్ అవుతున్న రోజులివి. సరిగ్గా దీనిని దృష్టిలో పెట్టుకోని నోకియా రెండు స్మార్ట్ ఫోన్స్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ రెండు ఫోన్లే నోకియా ఎన్8, నోకియా ఎన్9. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ గురించి ఓ చిన్న లుక్ వేద్దాం...

నోకియా విడుదల చేసినటువంటి ఎన్8, ఎన్9 రెండు కూడా ఒకే విధమైనటువంటి టచ్ స్క్రీన్‌ని కలిగి ఉన్నాయి. నోకియా ఎన్8 3.5 ఇంచ్ స్క్రీన్‌ని కలిగి ఉంటే, అదే నోకియా ఎన్9 3.9 ఇంచ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. నోకియా ఎన్8 స్క్రీన్ డైమన్షన్స్ 360* 640 కాగా, అదే నోకియా ఎన్9 డైమన్షన్స్ మాత్రం 480 *800 ఫిక్సల్‌గా ఉన్నాయి. నోకియా ఎన్8, నోకియా ఎన్9 రెండు మొబైల్స్‌లలో పెద్ద తేడా ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్. నోకియా ఎన్8 సింబియన్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంటే, నోకియా మీగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి ఒకే ఒక మొబైల్ నోకియా ఎన్9.

నోకియా ఎన్8, నోకియా ఎన్9 రెండు మొబైల్స్ కూడా మెసేజింగ్ ఫీచర్స్(ఎస్ఎమ్‌ఎస్, మెయిలింగ్ ఫెసిలిటీ) కలిగి ఉన్నాయి. రెండు మొబైల్స్ కూడా SMS, MMS, POP MAIL లాంటి ఫీచర్స్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక నోకియా ఎన్9 ఐతే SMS editor ఫెసిలిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా పవర్ పుల్ కెమెరాని కలిగి ఉన్నాయి. నోకియా ఎన్8 12మెగా ఫిక్సల్ కెమెరా తోపాటు ఆటో ఫోకస్, జినాన్ ఫ్లాష్ సౌకర్యాలను కలిగి ఉంది. నోకియా ఎన్8తో పోల్చితే నోకియా ఎన్ 9 కెమెరా మాత్రం చాలా తక్కువ. నోకియా ఎన్8 8మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. రెండు మొబైల్స్ కూడా వీడియో రికార్డింగ్‌ని సపోర్ట్ చేస్తాయి.

ఇక మల్టీమీడియా ఫీచర్స్ విషయానికి వస్తే నోకియా ఎన్8, నోకియా ఎన్9 రెండు అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌ని కలిగి ఉన్నాయి. నోకియా ఎన్8 ఎప్ఎమ్ రేడియో, ఎఫ్ఎమ్ ట్రాన్సిమీటర్ పొందుపరచడం జరిగింది. ఈ రెండు ఫీచర్స్ నోకియా ఎన్9లో పోందుపరచలేదు. రెండు మొబైల్స్ కూడా మొమొరీని 32జిబి వరకు ఎక్సాండబుల్ చేసుకోవచ్చు. రెండు మొబైల్స్ కూడా జావా అప్లికేషన్స్‌ని సపోర్ట్ చేస్తున్నాయి.

కనెక్టివిటీ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా EDGE, GPRS ఫెసిలిటీని కలిగి ఉన్నాయి. వైర్ లెస్ ఇంటర్నెట్ కోసం రెండు మొబైల్స్ కూడా WLAN ఫెసిలిటీని కలిగి ఉన్నాయి. నోకియా ఎన్8 బ్లూటూత్ 3 వర్సన్‌ని సపోర్ట్ చేస్తే, అదే నోకియా ఎన్9 మాత్రం బ్లూటూత్ 2 వర్సన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఖరీదు విషయానికి వస్తే నోకియా ఎన్8 ధర కేవలం రూ 22,000కాగా, అదే నోకియా ఎన్9 ధర రూ 32, 000గా నిర్ణయించడమైంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot