4100mAh బ్యాటరీతో నోకియా2 వచ్చేసింది, కేవలం రూ. 6999కే !
షియోమి, మోటో ఫోన్లను సవాల్ చేస్తూ నోకియా 2 ఇండియా మార్కెట్లోకి ఎంటరయ్యింది.
షియోమి, మోటో ఫోన్లను సవాల్ చేస్తూ నోకియా 2 ఇండియా మార్కెట్లోకి ఎంటరయ్యింది. 2 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే విధంగా 4100mAh బ్యాటరీతో నోకియా 2 మార్కెట్లో దుమ్మురేపేందుకు రెడీ అయింది. బడ్జెట్ ధరలో నోకియా నుంచి వస్తున్న మొట్టమొదటి ఫోన్ కూడా ఇదేనని కంపెనీ తెలిపింది. ఫీచర్లు కూడా నోకియా అభిమానులను అలరించే విధంగానే ఉన్నాయి.

మూడు వేరియంట్లలో..
మూడు వేరియంట్లలో నోకియా 2 రానుంది. Copper Black, Pewter Black and White starting లో ఈఫోన్ మార్కెట్ తలుపు తట్టనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో పాటు బ్యాక్ polycarbonate bodyతో ఈ మొబైల్ వచ్చింది.

ధర
దీని ధరను గ్లోబల్ మార్కెట్లో 99 యూరోలుగా నిర్ణయించారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 7500 గా ఉండనుంది. అయితే ఇండియాలో దీని ధర రూ. 6999గా ఉండే అవకాశం ఉంది.

నోకియా 2 ఫీచర్ల విషయానికొస్తే
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ (ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ కు రెడీ)
5ఇంచ్ హెచ్ డి డిస్ ప్లే, 720x1280 pixels రిజల్యూషన్
LTPS screen with 16:9 aspect ratio
4100mAh battery
quad-core Qualcomm Snapdragon 212 processor
1జిబి ర్యామ్, 8జిబి ఇంటర్నల్ స్టోరేజి, 128 జిబి విస్తరణ సామర్ధ్యం
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8 ఎంపీ రేర్ కెమెరా విత్ LED flash
4G VoLTE, Bluetooth, WiFi, GPS, dual-SIM and micro USB port.

నవంబర్ రెండో వారం నుంచి..
నవంబర్ రెండో వారం నుంచి ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని కంపెనీ తెలిపింది. కాగా నోకియా 3 కన్నా తక్కువ ధరకే ఈ ఫోన్ లభించడం విశేషం. బడ్జెట్ రేంజ్ ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గూగుల్ అసిస్టెంట్ ఫీచర్
గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ నోకియా2లో పొందుపరిచారు. ఇది ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. నోకియా అభిమానులు దీన్ని సొంతం చేసుకోవాలంటే నవంబర్ రెండో వారం వరకు ఆగాల్సిందే..


Click it and Unblock the Notifications








