నోకియా నుంచి రెండు సరికొత్త ఫీచర్ ఫోన్‌లు

Posted By:

ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియా తన ఫీచర్ ఫోన్‌ల విభాగాన్ని మరింత పటిష్టపరిచే క్రమంలో రెండు ప్రాధమిక వర్షన్ ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. నోకియా 225, నోకియా 225 డ్యుయల్ సిమ్ వర్షన్‌లలో రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌లు 2014, రెండవ క్వార్టర్ నుంచి ఎంపిక చేయబడిన మార్కెట్లలో లభ్యంకానున్నాయి. ధర అంచనా 30 యూరోలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.3,220). రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లాకా ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌‍లలో ఈ డివైస్‌లను విక్రయించనున్నారు.

నోకియా నుంచి రెండు సరికొత్త ఫీచర్ ఫోన్‌లు

నోకియా 225 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: సింగిల్ సిమ్, 2.8 అంగుళాల క్వాగా స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్), సిరీస్ 30 ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, మైక్రోయూఎష్బీ కనెక్టువిటీ, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా 225 డ్యుయల్ సిమ్ వేరియంట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 2.8 అంగుళాల క్వాగా‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్), సిరీస్ 30 ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, మైక్రోయూఎష్బీ కనెక్టువిటీ, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot