మార్కెట్లోకి నోకియా 3.1 ప్లస్, ఆ రోజే కొంటే 1000జీబిల డేటా ఉచితం!

|

ప్రముఖ బ్రాండ్ నోకియా రెండు సరికత్త మొబైల్ ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. నోకియా 3.1 ప్లస్ ఇంకా నోకియా 8810 మోడల్స్‌లో ఈ కొత్త‌హ్యాండ్ సెట్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో మొదటి హ్యాండ్‌సెట్ బడ్జెట్ సెంట్రిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కాగా, రెండవది ఎంట్రీ లెవల్ 4జీ ఫీచర్ ఫోన్.

 

ఆండ్రాయిడ్ వన్ బ్రాండింగ్‌తో ..

ఆండ్రాయిడ్ వన్ బ్రాండింగ్‌తో ..

ఆండ్రాయిడ్ వన్ బ్రాండింగ్‌తో వస్తోన్న నోకియా 3.1 ప్లస్ ప్రారంభ వేరియంట్ ధర రూ.11,499గా ఉంది. అక్టోబర్ 19 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. బనానా ఫోన్‌గా అభివర్ణించబడుతోన్న నోకియా 8110 ధర రూ.5,999గా హెచ్‌ఎండి గ్లోబల్ ఫిక్స్ చేసింది. అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ క్రింద నోకియా 3.1 ప్లస్ కొనుగోలు పై 1 టెరాబైట్ డేటాను ఎయిర్‌టెల్ ఉచితంగా అందించబోతోంది.

నోకియా 3.1 ప్లస్ స్పెసిఫికేషన్స్..

నోకియా 3.1 ప్లస్ స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూస్ కెపాసిటీ వచ్చసరికి 1440 x 720 పిక్సల్స్), 18:9 స్ర్కీన్ టు బాడీ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్స్), ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4G VoLTE, బ్లుటూత్ 4.1, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ, డ్యుయల్ సిమ్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్), ఫోన్ చుట్టుకొలత 156.68 x 76.44 x 8.19 మిల్లీ మీటర్లు, బరువు 180 గ్రాములు.

గూగుల్ అసిస్టెంట్ సపోర్టుతో నోకియా 8110..
 

గూగుల్ అసిస్టెంట్ సపోర్టుతో నోకియా 8110..

ఇక నోకియా 8110 విషయానికి వచ్చేసరికి, బనానా షేపుతో ఉన్న ఈ ఫీచర్ ఫోన్‌కు 4జీ కనెక్టువిటీ ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్టుతో వస్తోన్న ఈ డివైస్‌లో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యాప్స్ ఇన్‌బిల్ట్‌గా లోడ్ అయి ఉంటాయి. ఈ ఫోన్‌తో 4జీ డేటా కనెక్షన్‌ను హాట్‌స్పాట్‌లా కూడా ఉపయోగించుకునే వీలుంటుంది.

నోకియా 8110 స్పెసిఫికేషన్స్..

నోకియా 8110 స్పెసిఫికేషన్స్..

2.4 అంగేళాల క్యూవీజీఏ కర్వుడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ 205 మొబైల్ ప్లాట్‌ఫామ్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2 మెగా పిక్లస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్, మైక్రో యూఎస్బీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, మైక్రో సిమ్ స్లాట్, అప్‌డేటెడ్ వెర్షన్ స్నేక్ గేమ్.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Nokia 8110 or the company’s ‘banana’ phone has been launched along side Nokia 3.1 Plus in India.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X