Nokia 3 ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 7.1.1 అప్‌డేట్‌

నోకియా 3 ఫోన్‌లకు సంబంధించిన సేల్ జూన్ 17 నుంచి ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది.

|

హెచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలో ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ Nokia 3 లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుకుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన ఈ ఫోన్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ 7.1.1కు అప్‌డేట్ చేసుకోవచ్చు.

మీ ఫోన్‌లో Airtel VoLTE పొందటం ఎలా..?మీ ఫోన్‌లో Airtel VoLTE పొందటం ఎలా..?

ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్గ్ ప్రకారం

ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్గ్ ప్రకారం

ఓవర్ ద ఎయిర్ రూపంలో వర్తించే ఈ అప్‌డేట్ సైజ్ 750ఎంబి ఉంటుంది. ఈ అప్‌డేట్‌ను అందుకునే సమయంలో ఫోన్ బ్యాటరీ లెవల్స్ 50శాతం ఉండాలి, ఇదే సమయంలో 2జీబి స్టోరేజ్ స్పేస్ ఖాళీ ఉండాలి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి >About Phone -> Software Updateను చెక్ చేసుకోవటం ద్వారా మాన్యువల్‌గా ఈ అప్‌డేట్‌ను పొందే వీలుంటుంది.

జూన్ 17 నుంచి ఇండియన్ మార్కెట్లో  సేల్..

జూన్ 17 నుంచి ఇండియన్ మార్కెట్లో సేల్..

నోకియా 3 ఫోన్‌లకు సంబంధించిన సేల్ జూన్ 17 నుంచి ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 80,000 రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంచేందుకు గాను 400 డిస్ట్రిబ్యూటర్లను హెచ్‌ఎండి గ్లోబల్ అపాయింట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నోకియా మొబైల్ కేర్ సర్వీసును 300 నగరాలకు హెచ్‌ఎండి గ్లోబల్ విస్తరించినట్లు తెలుస్తోంది.

నోకియా 3 డిజైన్ అండ్ డిస్‌ప్లే

నోకియా 3 డిజైన్ అండ్ డిస్‌ప్లే

ఇతర నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే నోకియా 3 పాలికార్బోనేట్ బాడీతో వస్తోంది. ఆల్యూమినియమ్ ఫ్రేమ్ ధృడంగా అనిపిస్తుంది. వొంపులతో కూడిన ఎడ్జెస్ ఆకట్టుకుంటాయి. డిజైన్ పరంగా ఈ ఫోన్ మొదటి లుక్‌లోనే ప్రీమియమ్ ఫీల్‌ను కలిగిస్తుంది. సింగిల్ హ్యాండ్‌తో ఈ ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. సిల్వర్, కాపర్, tempered blue ఇంకా మాటీ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

ముండుటెండలో సైతం డిస్‌‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది...

ముండుటెండలో సైతం డిస్‌‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది...

నోకియా 3 ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1280×720 పిక్సల్స్. 2.5డి కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ప్రత్యేకమైన పోలరైజింగ్ లేయర్‌ను కలిగి ఉండే ఈ డిస్‌ప్లేలో వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. ముండుటెండలో సైతం డిస్‌‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది.

నోకియా 3 ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్...

నోకియా 3 ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్...

ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి నోకియా 3 ఫోన్ ను హై-ఎండ్ ఫోన్‌లతో పోల్చి చూడలేం. MediaTek 6737 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా మైక్రోఎస్డీ స్లాట్‌లు ఉన్నాయి. యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి

నోకియా 3 ముందు ఇంకా వెనక భాగాల్లో 8 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ధరకు తగ్గట్టుగా కెమరా పనితీరు ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి నోకియా 3 ఫోన్ 2,650mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్ పై రోజంతా వాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Nokia 3 finally getting Android 7.1.1 Nougat update. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X