Nokia 3 ప్రివ్యూ, రూ.9000లో బెస్ట్ ఫోన్ అవుతుందా..?
డిజైన్ , బిల్డ్ క్వాలిటీ, స్పెసిఫికేషన్స్ ఇలా అన్ని అంశాల్లో నోకియా 3 ఫోన్ పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్‌ను ఇవ్వగలిగింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 13న ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఇలా మూడు మోడల్స్‌లో ఈ ఫోన్‌లు లాంచ్ కాబోతున్నాయి. నోకియా పవర్ యూజర్ రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్‌ల ధరలు రూ.9,000 నుంచి రూ.15,000 మధ్య ఉండబోతున్నాయి.

నోకియా 3 మొదటి లుక్...
రూ.10,000లోపు ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేయబోతున్న నోకియా 3 మోడల్, ఇప్పటికే మార్కెట్‌ను శాసిస్తోన్న షియోమి వంటి బ్రాండ్‌లకు ప్రధాన పోటీగా నిలవబోతోంది. మార్కెట్లో నోకియా 3 ధర రూ.9,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది. తాజాగా గిజ్‌బాట్ బృందం నోకియా 3 మోడల్ మొదటి లుక్‌ను పరిశీలించటం జరిగింది. ఆ డిటేల్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది..

నోకియా 3 డిజైన్ అండ్ డిస్‌ప్లే
ఇతర నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే నోకియా 3 పాలికార్బోనేట్ బాడీతో వస్తోంది. ఆల్యూమినియమ్ ఫ్రేమ్ ధృడంగా అనిపిస్తుంది. వొంపులతో కూడిన ఎడ్జెస్ ఆకట్టుకుంటాయి. డిజైన్ పరంగా ఈ ఫోన్ మొదటి లుక్‌లోనే ప్రీమియమ్ ఫీల్‌ను కలిగిస్తుంది. సింగిల్ హ్యాండ్‌తో ఈ ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. సిల్వర్, కాపర్, tempered blue ఇంకా మాటీ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి
నోకియా 3 ఫోన్ ఐదు అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1280×720 పిక్సల్స్. 2.5డి కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ప్రత్యేకమైన పోలరైజింగ్ లేయర్‌ను కలిగి ఉండే ఈ డిస్‌ప్లేలో వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. ముండుటెండలో సైతం డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది. డిస్‌ప్లే పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలను ఫోన్ రిలీజ్ అయిన వెంటనే రివ్యూ రూపంలో మీకందించటం జరుగుతుంది.

నోకియా 3 ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్...
ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి నోకియా 3 ఫోన్ ను హై-ఎండ్ ఫోన్‌లతో పోల్చి చూడలేం. MediaTek 6737 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా మైక్రోఎస్డీ స్లాట్‌లు ఉన్నాయి. యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టం...
నోకియా 3 మోడల్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఫోన్‌తో ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. నోకియా 3 ఫోన్‌లో ఎటువంటి బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్లు లేవు.

కెమెరా ఇంకా బ్యాటరీ
కెమెరా విషయానికి వచ్చేసరికి నోకియా 3 ముందు ఇంకా వెనక భాగాల్లో 8 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ధరకు తగ్గట్టుగా కెమరా పనితీరు ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి నోకియా 3 ఫోన్ 2,650mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్ పై రోజంతా వాడుకోవచ్చు.

ముగింపు...
డిజైన్ , బిల్డ్ క్వాలిటీ, స్పెసిఫికేషన్స్ ఇలా అన్ని అంశాల్లో నోకియా 3 ఫోన్ పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్‌ను ఇవ్వగలిగింది. ఈ ఫోన్ పనితీరుకు సంబంధించిన ఇన్-డెప్త్ రివ్యూను ఫోన్ లాంచ్ అయిన వెంటనే మీకు అందించటం జరుగుతుంది.


Click it and Unblock the Notifications