నోకియా ఫోన్‌లకు నెలనెలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు

2017, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేసిన నోకియా 5, నోకియా 3, నోకియా 6 (గ్లోబల్ వేరియంట్) ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. త్వరలో మార్కెట్లో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్‌లకు సంబంధించి నెలనెలా అప్‌డేట్‌లను అందిస్తామని హెచ్‌ఎండి గ్లోబల్ చెబుతోంది.

Read More : ఇప్పుడు BSNL వంతు.. రోజుకు 2జీబి డేటా, నెలంతా కాల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్

మిగిలిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ తరహాలోనే తమ నోకియా బ్రాండ్ కూడా ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌తో పాటు నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్‌లను విడుదల చేయటం జరుగుతుందని నోకియా మొబైల్ ట్విట్టర్ హ్యాండిల్ ధృవీకరించింది.

Android 7.0 Nougat

హెచ్‌ఎండి గ్లోబల్ పరిచయం చేసిన నోకియా 3 మోడల్ Android 7.0 Nougat ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇదే సమయంలో నోకియా 5, నోకియా 6 మోడల్స్ Android 7.1.1 Nougat వర్షన్ పై రన్ అవుతాయి. భారత్ ఈ మూడు ఫోన్ లు జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటితో పాటుగా 2000 సంవత్సరంలో సంచలనం రేపిన ఐకానిక్ 3310 హ్యాండ్‌సెట్‌ను కూడా నోకియా మార్కెట్లో విడుదల చేయబోతోంది.

ధరలు..

నోకియా 6 ప్రారంభ వేరియంట్ ధర 229 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.16,100), నోకియా 6 స్పెషల్ ఎడిషన్ ధర 29 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.21,000), నోకియా 5 ధర 189 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.13,300), నోకియా 3 ధర 139 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.9,700), నోకియా 3310 ధర 49 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.3,400).

నోకియా 6 ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్). యూరోపియాన్ మార్కెట్లో నోకియా 6 ప్రారంభ వేరియంట్ ధర EUR229 (మన కరెన్సీలో షుమారుగా రూ.16,100)

నోకియా 5 అఫీషియల్ స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. యూరోపియన్ మార్కెట్లో నోకియా 5 ధర EUR189 (షుమారుగా మన ఇండియన్ కరెన్సీలో రూ.13,300)

నోకియా 3 అఫీషియల్ స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్), యూరోపియన్ మార్కెట్లో నోకియా 5 ధర EUR139 (షుమారుగా మన ఇండియన్ కరెన్సీలో రూ.9,700)

నోకియా 3310 అఫీషియల్ స్పెసిఫికేషపన్స్...

2.4 అంగుళాల QVGA డి‌స్‌ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, 16MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1200 mAh రిమూవబుల్ బ్యాటరీ (22 గంటల టాక్ టైమ్, 31 రోజుల స్టాండ్ బై టైమ్), బ్లుటూత్ కనెక్టువిటీ 3.0 విత్ స్లామ్, మైక్రో యూఎస్బీ, అందుబాటులో ఉండే రంగులు (వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే), యూరోపియన్ మార్కెట్లో నోకియా 5 ధర 49యూరోలు (షుమారుగా మన ఇండియన్ కరెన్సీలో రూ.3,400)

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 3, Nokia 5, Nokia 6 Android Phones to Receive Monthly Security Updates. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot