Home
Mobile

Made in India ట్యాగ్‌తో నోకియా ఫోన్‌లు

దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్ల ఏర్పాటు పై కూడా హెచ్‌ఎండి గ్లోబల్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

By Sivanjaneyulu Bommu

జూన్ , 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి రాబోతోన్న నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో లభ్యమవుతాయని తెలుస్తోంది. నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో Foxconn సంస్ధ తయారు చేయబోతోన్నట్లు సమాచారం.

Made in India ట్యాగ్‌తో నోకియా ఫోన్‌లు

ఏదికొన్నా 50% తగ్గింపు, సామ్‌సంగ్ సంచలనం

భారీ అంచానాల మధ్య ఇండియన్ మార్కెట్లోకి డుగుపెడుతున్న నోకియా ఫోన్‌లను అటు ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఇటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌ల అందుబాటుకు సంబంధించిన కీలక వివరాలను హెచ్‌ఎండి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా విభాగం) అజయ్ మెహతా FoneArenaకు వెల్లడించారు. మార్కెట్లో నోకియాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న నేపథ్యంలో సేల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్ల ఏర్పాటు పై కూడా హెచ్‌ఎండి గ్లోబల్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

 MWC 2017 ప్రీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా

MWC 2017 ప్రీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా

బార్సిలోనాలో ఆదివారం ఏర్పాటు చేసిన MWC 2017 ప్రీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా హెచ్‌ఎండి గ్లోబల్ నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫొన్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటితో పాటుగా ఐకానిక్ నోకియా 3310 హ్యాండ్‌సెట్‌ను కూడా హెచ్‌ఎండి గ్లోబల్ ప్రదర్శించింది.

 

ధరలు ఈ విధంగా ఉన్నాయి..

ధరలు ఈ విధంగా ఉన్నాయి..

నోకియా 6 ప్రారంభ వేరియంట్ ధర 229 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.16,100), నోకియా 6 స్పెషల్ ఎడిషన్ ధర 29 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.21,000), నోకియా 5 ధర 189 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.13,300), నోకియా 3 ధర 139 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.9,700), నోకియా 3310 ధర 49 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.3,400). నోకియా ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా రెండవ క్వార్టర్ నుంచి అందుబాటులో ఉంటాయి.

నోకియా 6 ప్రధాన స్పెసిఫికేషన్స్..

నోకియా 6 ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 5 అఫీషియల్ స్పెసిఫికేషన్స్..

నోకియా 5 అఫీషియల్ స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

నోకియా 3 అఫీషియల్ స్పెసిఫికేషన్స్..

నోకియా 3 అఫీషియల్ స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్),

నోకియా 3310 అఫీషియల్ స్పెసిఫికేషపన్స్...

నోకియా 3310 అఫీషియల్ స్పెసిఫికేషపన్స్...

2.4 అంగుళాల QVGA డి‌స్‌ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, 16MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1200 mAh రిమూవబుల్ బ్యాటరీ (22 గంటల టాక్ టైమ్, 31 రోజుల స్టాండ్ బై టైమ్), బ్లుటూత్ కనెక్టువిటీ 3.0 విత్ స్లామ్, మైక్రో యూఎస్బీ, అందుబాటులో ఉండే రంగులు (వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే),

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia 3, Nokia 5, Nokia 6 to Launch With 'Made in India' Tag in June. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X