సున్నా వడ్డీ పై Nokia 3

నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన నోకియా 3 సులభ వాయిదా పద్థతుల్లో దొరుకుతోంది. ఇందుకుగాను Home Credit ఇండియా ఫైనాన్స్ తో హెచ్ ఎండి గ్లోబల్ ఒప్పందం కుదర్చుకుంది. హోమ్ క్రెడిట్ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ స్కీమ్ లో భాగంగా నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌ను సున్నా వడ్డీతో సులభ వాయిదా పద్థతుల్లో సొంతం చేసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 3 స్పెసిఫికేషన్స్...

అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్). నోకియా 3 కోసం ప్రత్యేకమైన యాక్సెసరీస్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ అందుబాటులో ఉంచింది. వాటిలో నోకియా స్టీరియో హెడ్‌సెట్ WH-201 ఒకటి. ఈ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ హైక్వాలిటీ పనితీరును ఆఫర్ చేస్తాయి.

నోకియా 3 vs రెడ్‌మి 4

నోకియా 3 మోడల్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన షియోమీ రెడ్మీ 4కు పోటీగా భావిస్తున్నారు. పాలీకార్బోనేట్ బ్యాక్‌తో పాటు అల్యుమినియమ్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్న నోకియా ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది. స్పెసిఫికేషన్స్ పరంగా షియోమీ రెడ్మీ 4 ఫోన్‌ను నోకియా 3తో కంపేర్ చేసి చూసినట్లయితే...

డిస్‌ప్లే పరంగా చూస్తే..

నోకియా 3 మోడల్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ కెపాసిటీ (720x1280పిక్సల్స్). షియోమీ రెడ్మీ 4 మోడల్ 4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ కెపాసిటీ (1080x1920పిక్సల్స్.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి..

నోకియా 3 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. షియోమీ రెడ్మీ 4 మోడల్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

కెమెరా స్పెసిఫికేషన్స్...

నోకియా 3 ఫోన్‌లో ముందు వెనుకా సమానమైన 8 మెగా పిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగింది. షియోమీ రెడ్మీ 4 మోడల్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం

నోకియా 3 ఫోన్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. షియోమీ రెడ్మీ 4 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది

ర్యామ్, స్టోరేజ్

నోకియా 3: 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

షియోమీ రెడ్మీ 4: ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి),

బ్యాటరీ ఎంతంత..?

నోకియా 3 మోడల్ 2,630 mAh బ్యాటరీతో వస్తోంది.

షియోమీ రెడ్మీ 4 మోడల్ 4,100 mAh బ్యాటరీతో వస్తోంది.

ధరల వివరాలు

నోకియా 3 ధర రూ.9,499 షియోమీ రెడ్మీ 4 ప్రారంభ వేరియంట్ ధర రూ.6,999. అటు స్పెసిఫికేషన్స్ పరంగా ఇటు ధర పరంగా నోకియా 3 కంటే రెడ్మీ 4 మోడల్ ముందంజలో ఉంది. బ్రాండ్ వాల్యూను కోరుకునే వారికి నోకియా 3 బెస్ట్ ఆప్షన అయితే, ఎక్స్‌ట్రా పనితీరు కోరుకునే వారికి రెడ్మీ 4 బెస్ట్ ఆప్షన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 3 Now Available With Zero Percent Interest EMI Schemes in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot