ఆన్‌లైన్‌‌లో ప్రారంభమైన Nokia 3 అమ్మకాలు...

ఎంట్రి లెవల్ నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 3 జూన్ 16 నుంచి offline స్టోర్‌లలో దొరుకుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసారు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Croma, ఈ డివైస్‌ను రూ.9,499 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది. త్వరలోనే మరిన్ని ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం...

ఇటు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ నోకియా 3 ఇదే ధరతో దొరుకుతోంది. క్రోమా సైట్‌లో అందుబాటులో ఉంచిన నోకియా 3 డివైస్‌ను క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈఎమ్ఐ ఆప్షన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉంది.

నోకియా 3 స్పెసిఫికేషన్స్...

అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

నోకియా 3 స్పెసిఫికేషన్స్...

8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 3 కోసం యాక్సెసరీస్‌ కూడా...

నోకియా 3 కోసం ప్రత్యేకమైన యాక్సెసరీస్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ అందుబాటులో ఉంచింది. వాటిలో నోకియా స్టీరియో హెడ్‌సెట్ WH-201 ఒకటి. ఈ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ హైక్వాలిటీ పనితీరును ఆఫర్ చేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 3 online sale debuts in India; listed on Croma at Rs.9,499. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot