పాఠకుల కోసం నోకియా 303 ప్రత్యేకతలు

Posted By: Super

పాఠకుల కోసం నోకియా 303 ప్రత్యేకతలు

ఇండియన్ కస్టమర్స్‌కి నోకియా ప్రీతిపాత్రమైన మొబైల్ కంపెనీ. యూజర్స్ కొసం ఎల్లప్పుడూ కొత్త కొత్త మొబైల్స్‌ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది. అందులో భాగంగానే నోకియా ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి టచ్ అండ్ టైప్ సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనుంది. దాని పేరు నోకియా 303. యూజర్స్ కోసం నోకియా ఈ మొబైల్‌ని టచ్ స్క్రీన్ ఫెసిలిటీని అందించడమే కాకుండా క్వర్టీ కీప్యాడ్‌తో లభిస్తుంది. ఎవరైతే యూజర్స్ఈమెయిల్స్, ఎస్‌ఎమ్‌ఎస్ లను పంపేందుకు ఈ క్వర్టీ కీప్యాడ్ వారికి ఖచ్చితంగా సెట్ అవుతుంది.

నోకియా మొబైల్ ఫోన్స్‌ని వేరే మొబైల్స్‌తో పొల్చితే అన్ని విభాగాలలోను వాటి ఆధిక్యతను ప్రదర్శిస్తుంటాయి. ఇక నోకియా 303 మొబైల్ విషయానికి వస్తే వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో చూడచక్కని ఇమేజిలను మాత్రమే కాకుండా, హై డెఫినేషన్ వీడియోలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలను కూడా నోకియా 303 సపోర్ట్ చేస్తుంది. నోకియా 303 సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటికి ఈజీగా అనుసంధానం అయ్యేందుకు ప్రత్యేకమైన బటన్స్‌ని రూపొందించడం జరిగింది. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ సపోర్ట్ చేస్తాయి. బయట స్పీకర్స్‌కు నోకియా 303ని కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5 mm ఆడియో జాక్ ప్రత్యేకం.

నోకియా 303 అన్నింటికి మించి హై ఫెర్పామెన్స్‌ని అందిస్తుందనడానికి ప్రత్యేకమైన కారణం ఇందులో సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇని స్టాల్ చేయడమే. నోకియా 303కి సంబంధించిన అధికారిక ప్రకటన నోకియా కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే. నోకియా 303 మొబైల్‌కి సంబంధించి ధరను కూడా ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు.

నోకియా 303 మొబైల్ ప్రత్యేకతలు:

* Resistive Touchscreen Display
* QWERTY Keypad
* 3.2 Megapixel Camera
* Internal Memory
* Expandable Memory up to 32GB
* FM Radio
* Video/Audio player
* Wi-Fi
* Bluetooth
* Social Networking Apps Facebook,Twitter
* Email
* Micro USB
* 3.5 mm audio jack

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot