Home
Mobile

25 సంవత్సరాల పాపులర్‌ నోకియా ఫీచర్‌ ఫోన్‌ మళ్లీ వచ్చింది... 4G సపోర్టు సహా కీలక ఫీచర్లు..!

నోకియా ఫోన్లను తయారీ చేస్తున్న HMD సంస్థ తాజాగా అప్‌గ్రేడ్‌ చేసిన నోకియా మోడల్‌ను విడుదల చేసింది. 25 ఏళ్ల నాటి పాపులర్ హ్యాండ్‌సెట్‌ నోకియా 3210 ను (Nokia 3210 2024) మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్తగా అందుబాటులోకి వచ్చిన హ్యాండ్‌సెట్‌ ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది.

క్లాసిక్‌ ఫీచర్లతోపాటు అప్‌గ్రేట్‌ స్పెసిఫికేషన్లు :
కొత్తగా అందుబాటులోకి వచ్చిన నోకియా 3210 2024 ఫీచర్‌ ఫోన్‌లోనూ క్లాసిక్‌ T9 కీబోర్డు మరియు పాత మోడల్‌లో ఎంతో పాపులర్‌ అయిన స్కేక్ గేమ్‌ కూడా ఉంది. అయితే కొత్తగా 4G కనెక్టివిటీని పొందుతుంది. దీంతోపాటు 2.4 అంగుళాల TFT LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. QVGA రిజల్యూషన్‌ మరియు 2MP వెనుక కెమెరాతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది.

Nokia 3210 2024 feature phone launched news

32GB స్టోరేజీ వరకు పొడిగించుకోవచ్చు.. :
నోకియా 3210 2024 మోడల్ S30+ OS మరియు Unisoc T107 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ నోకియా ఫీచర్‌ ఫోన్‌ 64MB ర్యామ్‌ మరియు 128MB అంతర్గత స్టోరేజీతో లాంచ్ అయింది. అయితే మైక్రో SD కార్డు ద్వారా 32GB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు.

1450mAh బ్యాటరీ సామర్థ్యం :
నోకియా 3210 2024 మోడల్‌ USB-C ఛార్జింగ్‌ సపోర్టుతో 1450mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 9.8 గంటలపాటు కాలింగ్‌ టైమ్‌ను అందిస్తుంది. దీంతోపాటు గత మోడల్‌ మాదిరిగా 3.5mm ఆడియో జాక్‌ మరియు FM రేడియో, బ్లూటూత్‌ 5.0, MP3 ప్లేయర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. పాత మోడల్‌ తరహాలోనే కొత్త వేరియంట్‌ ఆకట్టుకొనే పనితీరును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Nokia 3210 2024 feature phone launched news

నోకియా 3210 2024 మోడల్‌ క్లౌడ్‌ యాప్‌ సపోర్టుతో లాంచ్ అయింది. డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టుతో 4G ను కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ గ్రంజ్‌ బ్లాక్‌, Y2k గోల్డ్‌, స్కూబా బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం జర్మనీ, స్పెయిన్‌ మరియు UK లో ప్రారంభించబడింది. భారత్‌లో త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది.

HMD కూడా సొంత బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. HMD పల్స్‌ పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిపింది. 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ 6GB ర్యామ్‌తో 64GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 13MP ప్రైమరీ కెమెరాతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

Nokia 3210 2024 feature phone launched news

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia 3210 2024 feature phone launched here are the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X