Home
Mobile

Nokia పాపులర్‌ ఫోన్‌లు విడుదల.. UPI పేమెంట్‌, స్నేక్ గేమ్‌, యూట్యూబ్‌ సహా ఎన్నో ఫీచర్‌లు..ధర, సేల్‌ వివరాలు

నోకియా పాపులర్‌ (Nokia Popular Phones relaunched 2024) ఫీచర్‌ ఫోన్‌ 3210 విడుదలై 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD (Human Mobile Devices) తాజాగా మూడు ఫోన్లను భారత్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో నోకియా 3210, నోకియా 235 4G, నోకియా 220 4G ఫోన్లను అప్‌ గ్రేడ్‌ ఫీచర్‌ లతో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌లు యూట్యూబ్‌, UPI ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ల ధర, ఫీచర్‌లు, సేల్‌ పూర్తి వివరాలు..

నోకియా 3210 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
నోకియా 3210 ( Nokia 3210 Phone ) ఫోన్‌ 8 యాప్‌ లను కలిగి ఉంటుంది. టెట్రిస్, 2048 గేమ్‌, క్రికెట్‌ స్కోర్‌, వెదర్‌ మరియు న్యూస్‌ సహా 8 యాప్‌ లను కలిగి ఉంది. ఈ ఫోన్ పాపులర్‌ అయిన స్నేక్ గేమ్‌ తో అందుబాటులోకి వచ్చింది. 2MP కెమెరా, ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంటుంది.

nokia-3210-phone-

ఈ నోకియా 3210 ఫోన్‌ నుంచి స్మార్ట్‌ ఫోన్ తరహాలో యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. దీంతోపాటు QR కోడ్‌ను స్కాన్‌ చేసి పేమెంట్‌ చేయవచ్చు. ఈ ఫోన్ ధర రూ.3,999 గా ఉంది. ఈ యాప్‌ లు ముందస్తు ఇన్‌ స్టాల్‌ చేసి ఉన్నాయి. స్కూబా బ్లూ, Y2k గోల్డ్‌, బ్లాక్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

నోకియా 235 4G ఫోన్‌ ఫీచర్‌ లు, ధర :
నోకియా 235 4G (Nokia 235 4G Phone) ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. బ్లూ, బ్లాక్‌, పర్పుల్‌ రంగుల్లో లభిస్తుంది. 2.8 అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 2MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ ధర రూ.3,749 గా ఉంది. యూపీఐ పేమెంట్లు చేసుకొనేందుకు ముందస్తుగా ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లను కలిగి ఉంది.

nokia-3210-phone-

నోకియా 220 4G ఫోన్‌ ఫీచర్‌లు, ధర :
నోకియా 220 4G ఫోన్‌ (Nokia 220 4G Phone) 2.8 అంగుళాల IPS డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ ద్వారా UPI పేమెంట్లు చేయవచ్చు. యూట్యూబ్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ పీచ్‌ మరియు బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.3,249 గా ఉంది. ఈ ఫోన్లను HMD, అమెజాన్ సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Nokia 3210 nokia 235 4g and nokia 220 4G phone launched in india price sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X