చేతికి చిక్కదిక, 3జీలో నోకియా 3310

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ విడుదల చేసిన నోకియా 3310 ఈ సారి చేతికి చిక్కేలా లేదు.

By Hazarath
|

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ విడుదల చేసిన నోకియా 3310 ఈ సారి చేతికి చిక్కేలా లేదు. ఎందుకంటే ఈ ఫోన్ ఇప్పుడు 3జీ వెర్షన్‌లో రాబోతోంది. 2జీ వెర్షన్‌లో ఉన్న ఈ ఫోన్‌ను అతి త్వరలో 3జీ వేరియెంట్‌గా విడుదల చేయనున్నారు. ఈ విషయమై ఇప్పటికే నోకియా తన 3310 ఫోన్‌కు చెందిన 3జీ వేరియెంట్‌ను తయారు చేసినట్టు తెలిసింది. ఈ వేరియెంట్ గురించిన పలు ఇమేజ్‌లు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి.

 

బీ రెడీ, నోకియా 8 రిలీజ్ డేట్ వచ్చేసిందిబీ రెడీ, నోకియా 8 రిలీజ్ డేట్ వచ్చేసింది

nokia 3310

ఇంటర్నెట్‌లో లీకైన సమాచారాన్ని బట్టి చూస్తే నోకియా 3310 ఫోన్ 3జీ వేరియెంట్‌లో దాదాపుగా పాత ఫీచర్లే ఉండనున్నట్టు తెలిసింది. కానీ కొత్త వేరియెంట్ 3జీ సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ త్వరలో విడుదల అయ్యేందుకు అవకాశం ఉంది..!

నోకియా 3310 స్పెసిఫికేషపన్స్...

నోకియా 3310 స్పెసిఫికేషపన్స్...

2.4 అంగుళాల QVGA డి‌స్‌ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, 16MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1200 mAh రిమూవబుల్ బ్యాటరీ (22 గంటల టాక్ టైమ్, 31 రోజుల స్టాండ్ బై టైమ్), బ్లుటూత్ కనెక్టువిటీ 3.0 విత్ స్లామ్, మైక్రో యూఎస్బీ, అందుబాటులో ఉండే రంగులు (వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే).

కొన్ని కోణాల్లో ఆలోచిస్తే

కొన్ని కోణాల్లో ఆలోచిస్తే

ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే నోకియా 3310 ఫోన్ బెస్ట్ అనిపిస్తుంది. ఇందుకు కారణం ఈ ఫోన్‌లోని గొప్ప ఫీచర్లే. మార్కెట్‌ను శాసిస్తోన్న హై-ఎండ్ ఫోన్‌లతో పోలిస్తే నోకియా 3310 బెస్ట్ అనటానికి పలు కారణాలను ఇప్పుడు చూద్దాం..

పగుళ్లు లేదా ప్రమాదాలు ఏర్పడినప్పుడు
 

పగుళ్లు లేదా ప్రమాదాలు ఏర్పడినప్పుడు

పగుళ్లు లేదా ప్రమాదాలు ఏర్పడినప్పుడు నోకియా 3310 ప్యానల్‌ను సులువుగా మార్చుకోవచ్చు.అదే సమస్య లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లలో తలెత్తినట్లయితే బోలెడంత సమయంతో పాటు డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది.

శక్తివంతమైన బ్యాటరీ..

శక్తివంతమైన బ్యాటరీ..

హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే నోకియా 3310 ఫోన్ పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది.

రూ.3310ని వెచ్చిస్తే చాలు.

రూ.3310ని వెచ్చిస్తే చాలు.

సామ్‌సంగ్, యాపిల్, హెచ్‌టీసీ కంపెనీలకు చెందని హై-ఎండ్ ఫోన్‌లను సొంతం చేసుకోవలంటే కనీసం రూ.40,000 వరకు పెట్టాలి. ఇదే సమయంలో నోకియా 3310 యూనిట్‌ను కొనాలంటే రూ.3310ని వెచ్చిస్తే చాలు..

మోనోక్రోమ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే దిబెస్ట్..

మోనోక్రోమ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే దిబెస్ట్..

మండుటెండలో వెళుతురు ఎక్కువు పడటం కారణంగా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు సరిగ్గా కనిపించవు. నోకియా 3310 మోనోక్రోమ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఎండలో సైతం సమర్థవంతంగా పనిచేస్తుంది.

సొంతంగా రింగ్‌టోన్‌ క్రియేట్ చేసుకోవచ్చు..

సొంతంగా రింగ్‌టోన్‌ క్రియేట్ చేసుకోవచ్చు..

నోకియా 3310లోని రింగ్‌టోన్‌లు స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే మరింత ఎక్కువ సౌండ్‌తో వినిపిస్తాయి. నోకియా 3310లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఇన్-బుల్ట్ టూల్ ద్వారా 5 రింగ్‌టోన్‌లను కంపోజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లలో లేకపోవచ్చు.

ప్రీలోడెడ్ గేమ్స్..

ప్రీలోడెడ్ గేమ్స్..

నోకియా 3310లో నాలుగు ప్రీలోడెడ్ గేమ్స్ ఉన్నాయి. అవి ప్యారిస్1, స్పేస్ ఇంపాక్ట్, బాంటుమి, స్నేక్ 2. నేటి ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్లలో వేలాది ఆన్‌లైన్ గేమ్‌లు సపోర్ట్ చేస్తున్నప్పటికి ఒక్క ప్రీలోడెడ్ గేమ్ కూడా హ్యాండ్‌సెట్‌లలో లేదు.

Best Mobiles in India

English summary
Nokia 3310 (2017) 3G Variant Spotted on Certification Site Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X