మే 5 నుంచి నోకియా ఫోన్ బుకింగ్స్

నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ నోకియా 3310 (2017 వర్షన్) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ మే 5, 2017 నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. డెలివరీ ప్రక్రియ మే 17, 2017 నుంచి మొదలవుతుందని సమాచారం.

బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే దిగిపోతుందా..? 6 ముఖ్యమైన కారణాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర రూ.3,899..

ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.3,899 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రిటైలింగ్ వెబ్‌సైట్‌లు నోకియా 3310 ఫోన్‌తో పాటు నోకియా 3, నోకియా 5 ఫోన్‌లను కూడా తమ లిస్టింగ్స్‌లో ఉంచాయి. అయితే, నోకియా మాత్రం ఏ విధమైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు.

ఆసక్తికర వాతావరణం...

నోకియా 3310 మోడల్ మళ్లీ మార్కెట్లోకి వస్తోందనగానే ఒక్కసారిగా మొబైల్ మార్కెట్లో ఆసక్తికర వాతావరణం నెలకుంది. 2000 సంవత్సరంలో మార్కెట్లో విడుదలైన అమ్మకాల సునామీని సృష్టించిన ఈ ఐకానిక్ మోడల్ ఫోన్‌ను మరోసారి మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు నోకియా సిద్దమైంది.

రూ.10,000లో బెస్ట్ ప్రాసెసర్ ఫోన్‌లు ఇవే

సరిగ్గా 17 సంవత్సరాల తరువాత..

నోకియా నుంచి 2000 సంవత్సరంలో విడుదలైన ఐకానిక్ 3310 ఫీచర్ ఫోన్‌ను సరిగ్గా 17 సంవత్సరాల తరువాత కొత్త లుక్‌తో మార్కెట్లోకి రావటంతో నోకియా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

30 రోజుల బ్యాటరీ బ్యాకప్..

ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే నోకియా 3310 (2017) ఎడిషన్ శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్ సపోర్ట్‌తో వస్తోంది. హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ చెబుతోన్న దాని ప్రకారం, ఈ ఫోన్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ పై 22 గంటల టాక్‌టైమ్ లేదా 30 రోజుల స్టాండ్ బై టైమ్‌ను ఆఫర్ చేయగలదు.

రీడిజైన్ చేయబడిన స్నేక్ గేమ్

అప్పటి మోస్ట్ పాపులర్ స్నేక్ గేమ్‌ను రీడిజైన్ చేసి ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే ఫోన్ కలర్ డిస్‌ప్లేను మరింతగా మెరుగుపరచటంతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా అనిపిస్తుంది. మోడ్రన్ లుక్‌లో కనిపించే నోకియా 3310 ఫోన్‌లో పిన్ ఛార్జర్‌కు బదులు మైక్రో యూఎస్బీ పోర్ట్‌ను చూడొచ్చు.

నోకియా 3310 స్పెసిఫికేషన్స్...

2.4 అంగుళాల QVGA డి‌స్‌ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, 16MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1200 mAh రిమూవబుల్ బ్యాటరీ (22 గంటల టాక్ టైమ్, 31 రోజుల స్టాండ్ బై టైమ్), బ్లుటూత్ కనెక్టువిటీ 3.0 విత్ స్లామ్, మైక్రో యూఎస్బీ, అందుబాటులో ఉండే రంగులు (వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే).

రూ.5000కే జియో ల్యాపీ..

డిజైన్ అండ్ డిస్‌ప్లే

నోకియా 3310 (2000) మోడల్‌లతో కొత్త వర్షన్ తక్కువ బరువుతో మరింత స్లిమ్‌‌గా అనిపిస్తుంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి కొత్త వర్షన్ నోకియా 3310 2.4 అంగుళాల color LCD డిస్‌ప్లే స్ర్కీన్‌తో వస్తోంది. ఇదే సమయంలో పాత వేరియంట్ 1.5 అంగుళాల monochrome LCD డిస్‌ప్లేను మాత్రమే కలిగి ఉంటుంది.

కలర్ వేరియంట్స్

కలర్ వేరియంట్స్ విషయానికి వచ్చేసరికి 2000 మోడల్ నోకియా 3310 ఫోన్ కేవలం "typical navy blue" కలర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. లేటెస్ట్ మోడల్ విషయానికి వచ్చేసరికి.. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే ఇలా రకరకాల కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

నోకియా 3310 (2000) మోడల్‌లో కెమెరా మనుకు కనపించదు. అయితే, కొత్త వర్షన్‌లో మాత్రం LED flash సౌకర్యంతో 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది.

BSNL ఉచిత వై-ఫై సేవలు ప్రారంభం, హైదరాబాద్‌లో ఎక్కడెక్కడంటే..?

కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి..

కనెక్టువిటీ ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి నోకియా 3310 (2000) మోడల్‌లో 2జీ కాలింగ్‌కు అవసరమైన dual band GSM 900/1800MHz వంటి ఎంట్రీ లెవల్ ఫీచర్లు మాత్రమే ఉండేవి. కొత్త వర్షన్‌లో మాత్రం dual band GMS 900/1800MHz సపోర్ట్‌తో పాటు మైక్రో యూఎస్బీ, బ్లుటూత్, 3.5ఎమ్ఎమ్ జాక్, మైక్రోఎస్డీ స్లాట్, ఎఫ్ఎమ్ రేడియో వంటి ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు ఫోన్‌లు 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి.

బ్యాటరీ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి

నోకియా 3310 (2000) వేరియంట్ 900mAh రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 2.5 గంటల టాక్‌టైమ్, 55 గంటల స్టాండ్ బై టైమ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇదే సమయంలో నోకియా 3310 (2017) వేరియంట్‌లో ఏర్పాటు చేసిన 1200mAh రిమూవబుల్ బ్యాటరీ 31 రోజుల స్టాండ్ బై టైమ్‌తో పాటు 22 గంటల టాక్ టైమ్‌ను ఆఫర్ చేస్తుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి కొత్త వర్షన్ నోకియా ఫోన్ 16ఎంబి స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది.

ఐఫోన్ 7 రేటు రూ.20,000 తగ్గింది

ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే..

అప్పటి మోస్ట్ పాపులర్ స్నేక్ గేమ్‌ను రీడిజైన్ చేసి ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే ఫోన్ కలర్ డిస్‌ప్లేను మరింతగా మెరుగుపరచటంతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా అనిపిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 3310 (2017) listed to go on pre-order in India on May 5 for Rs.3,899. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot