నోకియా 3310 ఆన్‌లైన్ సేల్ శుక్రవారం స్టార్ట్ అయ్యింది. కొద్ది రోజుల క్రితమే ఆఫ్‌లైన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్‌కు, నోకియా అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నోకియా నుంచి 2000 సంవత్సరంలో విడుదలైన ఐకానిక్ 3310 ఫీచర్ ఫోన్‌ను సరిగ్గా 17 సంవత్సరాల తరువాత కొత్త లుక్‌తో మార్కెట్లోకి తీసుకురావటంతో నోకియా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Croma website ద్వారా అమ్మకాలు..
ఆన్‌లైన్‌లో ఈ డివైస్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారు Croma websiteలోకి వెళ్లి ఫోన్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు.
నోకియా 3310 పాత వర్షన్‌తో పోలిస్తే కొత్త వర్షన్
నోకియా 3310 పాత వర్షన్‌తో పోలిస్తే కొత్త వర్షన్ కంప్లీట్ న్యూ లుక్‌లో కనిపిస్తోంది. నోకియా 3310 (2000), నోకియా 3310 (2017) మధ్య తేడాలను పరిశీలించినట్లయితే...
color LCD డిస్‌ప్లే స్ర్కీన్
నోకియా 3310 (2000) మోడల్‌లతో కొత్త వర్షన్ తక్కువ బరువుతో మరింత స్లిమ్‌గా అనిపిస్తుంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి కొత్త వర్షన్ నోకియా 3310 2.4 అంగుళాల color LCD డిస్‌ప్లే స్ర్కీన్‌తో వస్తోంది. ఇదే సమయంలో పాత వేరియంట్ 1.5 అంగుళాల monochrome LCD డిస్‌ప్లేను మాత్రమే కలిగి ఉంటుంది.
కలర్ వేరియంట్స్
కలర్ వేరియంట్స్ విషయానికి వచ్చేసరికి 2000 మోడల్ నోకియా 3310 ఫోన్ కేవలం "typical navy blue" కలర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. లేటెస్ట్ మోడల్ విషయానికి వచ్చేసరికి.. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే ఇలా రకరకాల కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
కెమెరా విషయానికి వచ్చేసరికి..
నోకియా 3310 (2000) మోడల్‌లో కెమెరా మనుకు కనపించదు. అయితే, కొత్త వర్షన్‌లో మాత్రం LED flash సౌకర్యంతో 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది.
కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి..
కనెక్టువిటీ ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి నోకియా 3310 (2000) మోడల్‌లో 2జీ కాలింగ్‌కు అవసరమైన dual band GSM 900/1800MHz వంటి ఎంట్రీ లెవల్ ఫీచర్లు మాత్రమే ఉండేవి. కొత్త వర్షన్‌లో మాత్రం dual band GMS 900/1800MHz సపోర్ట్‌తో పాటు మైక్రో యూఎస్బీ, బ్లుటూత్, 3.5ఎమ్ఎమ్ జాక్, మైక్రోఎస్డీ స్లాట్, ఎఫ్ఎమ్ రేడియో వంటి ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు ఫోన్‌లు 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి.
బ్యాటరీ ఇంకా స్టోరేజ్
బ్యాటరీ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి, నోకియా 3310 (2000) వేరియంట్ 900mAh రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 2.5 గంటల టాక్‌టైమ్, 55 గంటల స్టాండ్ బై టైమ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇదే సమయంలో నోకియా 3310 (2017) వేరియంట్‌లో ఏర్పాటు చేసిన 1200mAh రిమూవబుల్ బ్యాటరీ 31 రోజుల స్టాండ్ బై టైమ్‌తో పాటు 22 గంటల టాక్ టైమ్‌ను ఆఫర్ చేస్తుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి కొత్త వర్షన్ నోకియా ఫోన్ 16ఎంబి స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది.
ధరలు..
మార్కెట్లో పాత వర్షన్ నోకియా 3310 ధర రూ.2,710 వరకు ఉండేది. కొత్త వర్షన్ ధర రూ.3310గా ఉంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.