మళ్లీ కొత్త వెర్షన్‌లో బుడ్డ ఫోన్, దుమ్మురేపడం ఖాయమే ఇక !

Written By:

బుడ్డఫోన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అదేనండి నోకియా 3310. ఒకప్పుడు దుమ్మురేపిన ఈఫోన్ మళ్లీ సరికొత్త డిజైన్ తో వచ్చిన సంగతి తెలిసిందే. సరికొత్త డిజైన్ తో మార్కెట్లో తన సత్తా చాటింది కూడా. అయితే ఇప్పుడు మరో కొత్త వెర్షన్ లో నోకియా 3310 రాబోతోంది. ఇది సెప్టెంబర్ లేకుంటే అక్టోబర్ లో కాని వచ్చే అవకాశం ఉంది.

భారీ డిస్కౌంట్ పొందిన టీవీలు ఇవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మళ్లీ సరికొత్త డిజైన్‌తో

ఒకప్పుడు వినియోగదారుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న నోకియా 3310 మొబైల్‌ను మళ్లీ సరికొత్త డిజైన్‌తో హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

3జీ నెట్‌వర్క్‌ పనిచేయకపోవడంతో

అయితే ఈ మోడల్‌లో 3జీ నెట్‌వర్క్‌ పనిచేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు దీనిపై కాస్త అసంతృప్తిగా ఉన్నారట.

3జీ వెర్షన్‌ను కూడా

దీంతో కంపెనీ ఈ మోడల్‌లో 3జీ వెర్షన్‌ను కూడా విడుదల చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్‌ గతనెలలోనే వచ్చిందని తెలుస్తోంది.

సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో

సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ‘నోకియా 3310 3జీ' మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయొచ్చని అంటున్నారు.

ఐరిష్‌కు చెందిన ఓ టెలికాం సంస్థ

3జీ వెర్షన్‌పై హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. అయితే ఐరిష్‌కు చెందిన ఓ టెలికాం సంస్థ.. తాము నోకియా 3310 3జీ వెర్షన్‌ను పరిశీలించబోతున్నామని సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ మోడల్‌ విడుదల కావొచ్చు అని ట్వీట్‌ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాక

తొలుత ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాక భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఫోన్‌ ఫీచర్లలో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 3310 3G variant to arrive in late September or early October: Reports Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot