ఏప్రిల్ ఫూల్స్ జోక్: 41 మెగా పిక్సల్ కెమెరాతో నోకియా 3310!

Posted By:

ఏప్రిల్ 1, ఏప్రిల్ ఫూల్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నోకియా తన పురాతన ‘3310' మోడల్ హ్యాండ్‌సెట్‍‌ను పునరుద్ధరిస్తూ ప్రచురించిన ఓ ఆసక్తికర పోస్ట్ వెబ్ ప్రపంచంలో హల్‍‌చల్ చేస్తోంది. ఏప్రిల్ ఫూల్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే సామ్‌సంగ్, హెచ్‌టీసీ కంపెనీలు పలు జోకులను ప్రకటించాయి. ఇదే కోవలో నోకియా ఆకట్టుకునే ఏప్రిల్ ఫూల్ జోకుతో ముందుకొచ్చింది.

ఏప్రిల్ ఫూల్స్ జోక్:  41 మెగా పిక్సల్ కెమెరాతో నోకియా 3310!

14 సంవత్సరాల క్రితం నోకియా ఆవిష్కరించిన క్లాసికల్ ఫోన్ ‘నోకియా 3310' మొబైల్ ఫోన్ మార్కెట్లో పెద్ద సంచలనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ యూనిట్లు అమ్ముడైన ఈ డివైస్‌ను నోకియా అభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.

ఏప్రిల్ ఫూల్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నోకియా అలనాటి ‘నోకియా 3310' ఫోన్‌కు సంబంధించి ఫీచర్లను పునరుద్ధరిస్తూ ఆసక్తికర స్పెసిఫికేషన్ లతో కూడిన ఏప్రిల్ ఫూల్ కథనాన్ని ప్రచురించింది. ఆ కధనంలో భాగంగా నోకియా 3310 ఆధునికవర్షన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే....

ప్యూర్‌వ్యూ ఇమేజింగ్ సౌకర్యాలతో కూడిన 41 మెగా పిక్సల్ రేర్ - ఫేసింగ్ కెమెరా (కార్ల్‌జిస్ లెన్స్ ఇంకా జినాన్ ఫ్లాష్ ఫీచర్లతో),
ఆధునిక వర్షన్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
3 అంగుళాల క్లియర్ డైమెండ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరిచుకునే సౌలభ్యత.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot