అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో నోకియా 3310 4G దిగింది బాసూ !

By Hazarath
|

నోకియా 3310..ఈ ఫోన్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో నిజంగా ఓ సంచలనం. దిగ్గజ ఫీచర్ ఫోన్లకు సవాల్ విసురుతూ అనేక సంచలనాలు నమోదు చేసిన ఈ ఫోన్ సరికొత్త ఫీచర్లతో గతంలో మార్కెట్లోకి లాంచ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. HMD Global ఈ ఫీచర్ ఫోన్ కి సరికొత్త ఫీచర్లను జోడించి మార్కెట్లోకి తీసుకురాగా.. అది కేవలం 3జీలోనే వచ్చింది. ఇప్పుడు HMD Global సంస్థ దానికి ఇంకా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించి 4జీతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. చైనా మార్కెట్లో ఈ ఫోన్ ఇప్పుడు చక్కర్లు కొట్టేందుకు రెడీ అయింది.

 

మీ డబ్బుకి న్యాయం చేసే స్మార్ట్‌ఫోన్ హానర్ 9 లైట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి !మీ డబ్బుకి న్యాయం చేసే స్మార్ట్‌ఫోన్ హానర్ 9 లైట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి !

చైనా YunOS ఆపరేటింగ్ సిస్టం

చైనా YunOS ఆపరేటింగ్ సిస్టం

HMD Global సంస్థ నోకియా 3310 4G ఫీచర్ ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. చైనా మొబైల్ ద్వారా Nokia 3310 4G అక్కడి వారికి అందుబాటులోకి వస్తోంది. అయితే ఇది చైనా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఫోన్లో చైనా YunOSని పొందుపరిచారు. అలాగే ఈ ఫోన్ కి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా Wi-Fi and Wi-Fi Hotspot నిలవనున్నాయి. ఈ అడ్వాన్స్ ఫీచర్లను నోకియా 3310 4Gలో పొందుపరిచారు. వీటి ద్వారా ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది.

సరికొత్తగా నోకియా 3310 4G..

సరికొత్తగా నోకియా 3310 4G..

గతేడాది Mobile World Congress (MWC) tech expoలో ఈ ఫోన్ ని కంపెనీ ఆవిష్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. 117 x 52.4 x 13.35 mm చుట్టుకొలతలతో పాటు 88.1 గ్రాములు బరువుతో ఈ ఫోన్ ఉంటుంది. అయితే వీటిని ఇంకొంచెం పెంచుతూ సరికొత్తగా నోకియా 3310 4Gని HMD Global సంస్థ మార్కెట్లోకి తీసుకొస్తోంది.

Fresh Blue and Dark Black రంగులో..
 

Fresh Blue and Dark Black రంగులో..

Fresh Blue and Dark Black రంగులో Nokia 3310 4G వస్తోంది. సింగిల్ మైక్రో-సిమ్ సపోర్ట్, 2.4-inch display,resolution of 320 x 240 pixelsతో ఫోన్ రానుంది. Nokia 3310 4G డిస్ ప్లే వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

స్టోరేజ్

స్టోరేజ్

స్టోరేజ్ విషయానికొస్తే 256 MB and 512 MBలలో ఫోన్ రానుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని విస్తరించుకోవచ్చు. ఫోటోలు తీసుకోవాలనుకునే వారికి 2 మెగా ఫిక్సల్ కెమెరాని ఇందులో పొందుపరిచారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, microUSB, Bluetooth 4.0, and 3.5mm audio jack లాంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే 1,200mAh battery. 4G VoLTE మీద 5గంటల టాక్ టైంతో పాటు 12 రోజులు standby time ఉంటుంది.

ధర..

ధర..

అయితే ఈ ఫోన్ ధర ఎంతనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. నోకియా అఫిషియల్ Mobile websiteలో మాత్రం ఈ ఫోన్ చైనీస్ ఎడిషన్ లిస్ట్ అయింది. అతి త్వరలోనే ఈ ఫోన్ చైనాలోని మొబైల్ స్టోర్స్ లోకి అమ్మకానికి వెళ్లే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ ఎడిషన్ మీద ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కంపెనీ నుంచి వెలువడలేదు.

 MWC 2018 tech exhibitionలో..

MWC 2018 tech exhibitionలో..

అనధికార వర్గాల సమాచారం ప్రకారం రానున్న MWC 2018 tech exhibitionలో Nokia 3310 4Gని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు Nokia 3310 (2017) ఫోన్ రానున్న కాలంలో మరిన్ని రంగుల్లో వచ్చే అవకాశం ఉంది.

వీడియో

ఈ ఫోన్ కి సంబంధించిన వీడియో ఇదే.

Best Mobiles in India

English summary
Nokia 3310 4G Officially Unveiled with Yun OS, 4G VoLTE, Wi-Fi Capabilities More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X