నోకియా 3310 ఖరీదైన వర్షన్

కొద్ది రోజుల క్రితమే నోకియా తన ఐకానిక్ మోడల్ 3310 ఫోన్‌ను, కొత్త హంగులతో మార్కెట్లో రీఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. నోకియా 3310 (2017) మోడల్‌గా పిలవబడుతోన్న ఈ ఫోన్‌కు సంబంధించి లగ్జరీ ఎడిషన్‌ను Caviar అనే సంస్ధ మార్కెట్లో అనౌన్స్ చేసింది. సుప్రిమో పుతిన్ (Supremo Putin) పేరుతో ఈ ఫోన్ లభ్యమవుతుంది. రష్యాలో అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తుల్లో ఒకరైన పుతిన్‌ను ప్రేరణగా తీసుకుని ఈ ఎడిషన్‌ను రూపోందించినట్లు కావియార్ కంపెనీ తెలిపింది.

రూ.999 జియో ఫోన్, ఫీచర్లు కేక..!

నోకియా 3310 ఖరీదైన వర్షన్

ఈ ఫోన్ వెనుక భాగంలో వ్లాదిమిర్ పుతిన్ ముఖంతో కూడిన బాంగారపు ప్రతిమను అమర్చారు. ఆయన ఫోటో కిందే రష్యా జాతీయ గీతానికి సంబంధించిన ఓ కొటేషన్‌ను గోల్డ్ సీల్‌లో రాయటం జరిగింది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ప్లేటెడ్ బటన్ ఆకట్టుకుంటుంది. ఆండ్రాయిడ్ ఆథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. నోకియా 3310 సుప్రిమో పుతిన్ వర్షన్ ప్రత్యేకమైన ఉడెన్ కేస్‌లో డెలివరీ కాబడుతుంది. ధర 1690 డాలర్లట, ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ. 1,12,785.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 3310 లగ్జరీ ఎడిషన్ ఫోటోగ్యాలరీ

ఫోన్  వెనుక భాగం

నోకియా 3310 లగ్జరీ ఎడిషన్ ఫోటోగ్యాలరీ

క్లాసికల్ లుక్‌తో  ఫోన్ ముందు భాగం

నోకియా 3310 లగ్జరీ ఎడిషన్ ఫోటోగ్యాలరీ

ఫోన్ లుక్ సైడ్ బై సైడ్

నోకియా 3310 లగ్జరీ ఎడిషన్ ఫోటోగ్యాలరీ

ఫోన్ కెమెరా భాగం..

నోకియా 3310 లగ్జరీ ఎడిషన్ ఫోటోగ్యాలరీ

ఫోన్ లుక్ సైడ్ బై సైడ్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 3310 luxury edition launched; Guess the price!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot