నోకియా ఫోన్ ఈ రేంజ్‌లో షాక్ ఇచ్చిందా..?

Written By:

నోకియా...ఈ పేరు అంటేనే మార్కెట్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతీ ఫోన్ దుమ్మురేపింది కూడా. ఈ మధ్య రిలీజయిన నోకియా 3310 ఫోన్ అయితే అమ్మకాల్లో ఓ సునామిలా దూసుకుపోయింది. అయితే ఆ ఫోన్ అమ్మకాల్లోనే కాదు..ధరలో కూడా దూసుకుపోతోంది. ఏకంగా దాని ధర లక్షకు చేరిందంటే నమ్మగలరా...?

శాంసంగ్ బంపరాఫర్, ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పుతిన్-ట్రంప్ సమ్మిట్

నోకియా ఫీచర్‌ ఫోన్‌ను తిరిగి లాంచ్‌​ చేసి ఫోన్‌ లవర్స్‌ను ఇంప్రెస్‌ చేసిన నోకియాసంస్థ ఇపుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. పుతిన్-ట్రంప్ సమ్మిట్' స్పెషల్‌ ఎడిషన్‌ గా నోకియా 3310 (2017)ను లాంచ్‌ చేసింది.

జీ20 అంతర్జాతీయ సమ్మిట్‌

జీ20 అంతర్జాతీయ సమ్మిట్‌ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశానికి గౌరవంగా దీన్ని రూపొందించింది. రష్యన్ ఫోన్ కస్టమైజర్‌ కావియర్ నోకియా 3310 పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్‌ను సృష్టించింది.

ధర

నోకియా 3310 'పుతిన్-ట్రంప్ సమ్మిట్' ఎడిషన్ ధర 2,468డాలర్ల (రూ. 1.6 లక్షలు) ప్రీమియం ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

బంగారం పూత పూసిన

ఇక ఈ స్పెషల్‌ నోకియా 3310 ఫీచర్ల విషయానికిస్తే మిగితా ఫీచర్లన్నీ రెగ్యులర్‌ వేరియంట్‌ ఫీచర్లే ఉన్నాయి. అయితే బంగారం పూత పూసిన పుతిన్‌-ట్రంప్‌ ఫోటో, 'బ్లాక్ వెల్వెట్' విలాసవంతమైన కవరే దీని ప్రత్యేకత.

ప్రపంచ నాయకులిద్దరూ

వీటి-23 గ్రేడ్ స్వచ్చమైన టైటానియంతో డమస్క్ స్టీల్ పూత తో ఈ కవర్‌ను ప్రత్యేకంగా రూపొందించారట. ప్రపంచ నాయకులిద్దరూ ఒక దేశగా చూస్తూ ఉన్న చిహ్నంలో ట్రంప్, పుతిన్ రష్యా-అమెరికా సంబంధాల పురోగతి కాంక్షను సూచిస్తోందని కావియార్ ప్రకటించింది.

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ తో పోలిస్తే

దీంతోపాటు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ల పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్లను అందిస్తున్నప్పటికీ, నోకియా 3310 (2017) తో పోలిస్తే వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించాలి.

అతి విలాసవంతమైన ఫోన్‌

ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ ఫోన్లలో ఒకటిగా నిలిచిన ఈ ఫీచర్ ఫోన్ ఇపుడు అతి విలాసవంతమైన ఫోన్‌గా అవతరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 3310 Luxury 'Putin-Trump Summit' Edition Launched at $2,468 Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting