Home
Mobile

కాస్కోండి.. నేను మళ్లీ వస్తున్నా!

2000 సంవత్సరంలో విడుదలై మార్కెట్లో పెను సంచలనం రేపిన నోకియా 3310 ఫోన్ ను మోడ్రన్ ఫీచర్లతో నోకియా మరోసారి మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

By Sivanjaneyulu Bommu

నోకియా రీఎంట్రీ అటు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌నే కాదు ఇటు ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను షేకాడిస్తోంది. MWC 2017 టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో లాంచ్ కాబోతున్న నోకియా ఫోన్‌ల పై మొబైల్ మార్కెట్లో ఉత్కంఠభరిత వాతావారణం నెలకుంది.

మార్కెట్లో రీఎంట్రీకి సంబంధించి కీలక వివరాలను వెల్లడించేందుకు HMD Global నేతృత్వంలోని నోకియా ఫిబ్రవరి 26న ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Read More : రూ.3,799కే 4G VoLTE ఫోన్, 16జీబి స్టోరేజ్ కూడా..

MWC ప్రీ-ఈవెంట్‌లో భాగంగా

MWC ప్రీ-ఈవెంట్‌లో భాగంగా

MWC ప్రీ-ఈవెంట్‌లో భాగంగా నోకియా తన నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఓ ఐకానిక్ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోన్నట్లు సమాచారం.

ఐకానిక్ నోనకియా 3310

ఐకానిక్ నోనకియా 3310

2000 సంవత్సరంలో విడుదలై మార్కెట్లో పెను సంచలనం రేపిన నోకియా 3310 ఫోన్‌ను మోడ్రన్ ఫీచర్లతో నోకియా మరోసారి మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

బెటర్ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లతో..

బెటర్ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లతో..

నోకియా 3310 ఫోన్‌ను ప్రస్తుత జనరేషన్‌కు తగ్గట్టుగా బెటర్ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లతో పాటు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌తో రాబోతున్న ఈ ఫోన్ ధర రూ.4,000 ఉండొచ్చని తెలుస్తోంది.

126 మిలియన్ యూనిట్లు..

126 మిలియన్ యూనిట్లు..

Nokia 3310, 20వ శతాబ్థం ఆరంభంలో ఈ ఫోన్ పెద్ద సంచలనం. 2000 సంవత్సరంలో విడుదలైన నోకియా 3310 ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఎంత చెప్పుకున్నా తక్కువే...

ఎంత చెప్పుకున్నా తక్కువే...

నోకియా 3310 ఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెల్‌ఫోన్‌లో మొబైల్ గేమ్ ఆడాలంటే రెండు చేతులు అవసరమవుతాయి. కానీ, నోకియా 3310 ఫోన్‌లో సింగిల్ హ్యాండ్ చాలు. నోకియా 3310లో లోడ్ చేసిన స్నేక్ II, ప్యారిస్ II, స్పేస్ ఇంపాక్ట్ వంటి గేమ్‌లు కేవలం ఒక్క చేతిలో కంట్రోల్ చేయవచ్చు.

అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌

అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌

నోకియా 3310 అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్‌ను రిపేర్ చేసుకునేందుకు పెద్దగా విజ్ఞానం కూడా అవసరం లేదు. మండుటెండలో సైతం నోకియా 3310 డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది.

ఎన్నిసార్లు క్రింది పడినా ఏమి కాదు..

ఎన్నిసార్లు క్రింది పడినా ఏమి కాదు..

నోకియా 3310 సరిగ్గా ప్యాంట్ జేబులో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. నోకియా 3310 ఫోన్ ఎన్ని సార్లు క్రింద పడేసినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Modern Nokia 3310 may be launched at the MWC 2017. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X