Home
Mobile

3జీలో నోకియా 3310, ధర చూస్తే బేజారే, ఇండియాకి షాక్ !

ఇప్పుడు 3జీ కనెక్టవిటీతో కూడిన నోకియా 3310ని హెచ్‌ఎండీ గ్లోబల్ తీసుకొచ్చింది.

By Hazarath

ఒకప్పుడు ప్రపంచ మొబైల్ రంగాన్ని ఏలిన నోకియా 3310 ఫోన్.. ఆధునిక హంగులతో, అధునాతన డిజైన్‌తో తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. నోకియా బ్రాండ్‌ను సొంతం చేసుకున్న హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఈ మొబైల్‌ను రీ లాంచ్ చేసింది. పాత హ్యాండ్‌సెట్‌తో పోలిస్తే పూర్తి డిఫరెంట్‌ లుక్‌తో ఉన్న ఈ మొబైల్‌ను 3310 పేరుతో విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని భావించింది. అయితే అది మార్కెట్లో ఊపందుకోవడంతో పూర్తిగా నిరాశలోకి వెళ్లింది. అయితే మళ్లీ దాన్ని 3జీ కింద తీసుకువచ్చింది.

3జీ కనెక్టవిటీతో కూడిన నోకియా 3310ని

3జీ కనెక్టవిటీతో కూడిన నోకియా 3310ని

ఇప్పుడు 3జీ కనెక్టవిటీతో కూడిన నోకియా 3310ని హెచ్‌ఎండీ గ్లోబల్ తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఇది భారత్‌లో అందుబాటులోకి రాలేదు. ఇది భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందో వెల్లడించలేదు. వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు.

అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియాలో..

అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియాలో..

అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియాలో ఈ నోకియా 3310 3జీ ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయని హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రొడక్ట్ చీఫ్ ఆఫీసర్ జుహో సర్వికాస్ చెప్పారు.

మొత్తం నాలుగు రంగుల్లో

మొత్తం నాలుగు రంగుల్లో

కాగా, కొత్త నోకియా 3310 3జీ ఫీచర్ ఫోన్ మొత్తం నాలుగు రంగుల్లో (ఎల్లో, వార్మ్ రెడ్, అజ్యూర్, చార్‌కోల్) లభించనుంది. ఈ ఫోన్ 6.5 గంటల టాక్‌టైంను, 27 రోజుల స్టాండ్‌బై టైంను అందిస్తుంది.

ధర సుమారుగా రూ. 5,300

ధర సుమారుగా రూ. 5,300

గత ఫోన్‌తో పోలిస్తే 3జీ కనెక్టవిటీ తప్ప ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే దీని ధర సుమారుగా రూ. 5,300 ఉండొచ్చని అంచనా.

2.4 అంగుళాల డిస్ప్లే

2.4 అంగుళాల డిస్ప్లే

సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్, 2.4 అంగుళాల డిస్ప్లే, డ్యుయల్ సిమ్, 2ఎంపీ కెమెరా, 16ఎంబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీతో మెమొరీని 32జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 1200ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Nokia 3310 relaunched with 3G internet for first time Read more at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X