30 రోజుల బ్యాటరీ, కొత్త హంగులతో స్నేక్ గేమ్.. ఇవీ నోకియా 3310 ప్రత్యేకతలు

2000 సంవత్సరంలో సంచలనం రేపిన నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ నోకియా 3310 మరోసారి మన ముందుకు వచ్చేసింది. ఆదివారం రాత్రి జరిగిన MWC 2017 ప్రీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా తన సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు హిస్టారికల్ నోకియా 3310 ఫోన్‌ను మోడ్రన్ లుక్‌తో అనౌన్స్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ ధర 49 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.3,500).

Read More : మోటరోలా కొత్త ఫోన్‌లు వచ్చేసాయ్.. మోటో జీ5, జీ5 ప్లస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

భారత్‌లో నోకియా 3310 (2017) ఎడిషన్ అమ్మకాలు రెండవ క్వార్టర్ నుంచి ప్రారంభమవుతాయని HMD గ్లోబల్ ధృవీకరించింది. ఇదే ఈవెంట్‌లో భాగంగా నోకియా 6 గ్లోబర్ వర్షన్ తో పాటు నోకియా 3, నోకియా 5 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ ప్రదర్శించింది.

30 రోజుల బ్యాటరీ బ్యాకప్..

ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే నోకియా 3310 (2017) ఎడిషన్ శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్ సపోర్ట్‌తో వస్తోంది. హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ చెబుతోన్న దాని ప్రకారం, ఈ ఫోన్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ పై 22 గంటల టాక్‌టైమ్ లేదా 30 రోజుల స్టాండ్ బై టైమ్‌ను ఆఫర్ చేయగలదు.

రీడిజైన్ చేయబడిన స్నేక్ గేమ్

అప్పటి మోస్ట్ పాపులర్ స్నేక్ గేమ్‌ను రీడిజైన్ చేసి ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే ఫోన్ కలర్ డిస్‌ప్లేను మరింతగా మెరుగుపరచటంతో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా అనిపిస్తుంది. మోడ్రన్ లుక్‌లో కనిపించే నోకియా 3310 ఫోన్‌లో పిన్ ఛార్జర్‌కు బదులు మైక్రో యూఎస్బీ పోర్ట్‌ను చూడొచ్చు.

నోకియా 6, నోకియా 5, నోకియా 3.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

నోకియా 3310 స్పెసిఫికేషపన్స్...

2.4 అంగుళాల QVGA డి‌స్‌ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, 16MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1200 mAh రిమూవబుల్ బ్యాటరీ (22 గంటల టాక్ టైమ్, 31 రోజుల స్టాండ్ బై టైమ్), బ్లుటూత్ కనెక్టువిటీ 3.0 విత్ స్లామ్, మైక్రో యూఎస్బీ, అందుబాటులో ఉండే రంగులు (వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 3310 With Month-Long Battery Life, Snake Game Launched at MWC 2017.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot