దిగ్గజాలు ఖంగుతినేలా నోకియా నుంచి ఒకేసారి 5 స్మార్ట్‌ఫోన్లు !

హెచ్‌ఎండీ గ్లోబల్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారాల్లోకి నోకియా సరికొత్తగా రీఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

By Hazarath
|

హెచ్‌ఎండీ గ్లోబల్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారాల్లోకి నోకియా సరికొత్తగా రీఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. గతేడాది మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చి అభిమానుల్లో మళ్లీ సరికొత్త ఆశలను రేకెత్తించింది. నోకియా బ్రాండులో బడ్జెట్‌, ప్రీమియం సెగ్మెంట్లలో పలు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చి సత్తా చాటాయి. అయితే ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగించేందుకు నోకియా రెడీ అయింది. ఒకేసారి 5 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

 

జియోఫీచర్ ఫోన్‌కి పోటీగా నోకియా 4జీ ఫోన్ !జియోఫీచర్ ఫోన్‌కి పోటీగా నోకియా 4జీ ఫోన్ !

ఈ ఏడాది..

ఈ ఏడాది..

నోకియా నుంచి ఈ ఏడాది నోకియా 9, ఆండ్రాయిడ్‌ గో-ఆధారిత నోకియా 1, నోకియా 6(2018), నోకియా 4, మరో హైఎండ్‌ ఎడిషన్‌ నోకియా 7 కాని లేక నోకియా 7 ప్లస్‌ కాని మార్కెట్లోకి దూసుకురానున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

GizmoChina ..

GizmoChina ..

చైనా లీకుల వెబ్‌సైట్ GizmoChina ఈ వివరాలను లీక్ చేసింది. నోకియా 4, నోకియా 7 ప్లస్‌ లు ఈ ఏడాది మార్కెట్ తలుపులు తట్టబోతున్నాయని నోకియా కెమెరా యాప్‌ కూడా తేల్చి చెప్పింది.

 

ముందస్తు రిపోర్టుల ప్రకారం
 

ముందస్తు రిపోర్టుల ప్రకారం

ముందస్తు రిపోర్టుల ప్రకారం నోకియా 6(2018), నోకియా 1 ఫోన్లతో నోకియా 9ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటిస్తుందని తెలిసింది. నోకియా 4, నోకియా 7 ప్లస్‌ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది.

నోకియా 9

నోకియా 9

హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌గా రాబోతున్న నోకియా 9, 5.5 అంగుళాల ఓలెడ్‌ ప్యానల్‌, బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835, 3,250 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ, వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉండబోతుంది..

నోకియా 7 స్పెసిఫికేషన్స్..

నోకియా 7 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల 1080 పిక్సల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కార్ల్ జిస్ ఆప్టిక్స్ టెక్నాలజీ, 360 డిగ్రీ క్రిస్టల్ క్లియర్ సౌండ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000mAh

నోకియా 9 రూమర్ స్పెసిఫికేషన్స్..

నోకియా 9 రూమర్ స్పెసిఫికేషన్స్..

5.3 అంగుళాల క్వాడ్-హైడెఫినిషన్ కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్‌, 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ర్యామ్, ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.45,000 వరకు ఉండొచ్చు.

 నోకియా 1 రూమర్ స్పెసిఫికేషన్స్

నోకియా 1 రూమర్ స్పెసిఫికేషన్స్

5 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 212 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో (గో ఎడిషన్), 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నోకియా 6 2018 రూమర్ స్పెసిఫికేషన్స్..

నోకియా 6 2018 రూమర్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

Best Mobiles in India

English summary
Nokia 4, Nokia 7 Plus and Nokia 1 teased via Nokia camera application More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X