Home
Mobile

Nokia 5.2 ఫీచర్స్ లీక్... బడ్జెట్ ధరలో పోటీకి సిద్ధం!!!

నోకియా తన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020 ఈవెంట్‌ను స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 23 న ప్రకటించింది. ఫిబ్రవరి 23 న స్థానిక సమయం సాయంత్రం 4 గంటలకు (ఇండియా యొక్క కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు) షెడ్యూల్ కోసం ఇది మీడియా ఆహ్వానాలను పంపింది.

నోకియా 5.2

ఈ కార్యక్రమంలో ఫిన్నిష్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా 5.2, నోకియా 8.2 మరియు నోకియా 1.3 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ కొత్త ఫీచర్లతో రన్ అవుతున్న ఈ ఫోన్ల మీద చాలా రకాల పుకార్లు ఉన్నప్పటికీ ఇవి మిడ్-రేంజ్ డివైస్ లకు కీలకం కావచ్చు. ఈ నెల 23న జరిగే కార్యక్రమానికి ముందుగానే నోకియా 5.2 పీజానే యొక్క ఫోటోలు లీక్ అయ్యాయి.

 

 

నోకియా 5.2 ఫీచర్స్

నోకియా 5.2 ఫీచర్స్

లీకైన ఫోటో పవర్ బటన్‌తో పాటు కుడి వైపున వాల్యూమ్ రాకర్‌ను కూడా చూపిస్తుంది. ఎడమ వైపున గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకమైన బటన్‌ కూడా ఉంది. దిగువన ఒక USB పోర్ట్ ఉంద. అయితే ఇది USB టైప్-సి లేదా మైక్రో యుఎస్బి పోర్ట్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ ర్యామ్‌ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావచ్చు అని లీక్‌స్టర్ పేర్కొంది. దీని ధర $ 180 (సుమారు రూ.12,900) వద్ద ఉండవచ్చు అని అంచనా. ఇది మార్చి 4, 2020 న విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ షియోమి మరియు రియల్‌మి వంటి బడ్జెట్ ఫోన్ లకు గట్టి పోటీగా ఉండబోతుంది అని అంచనా.

 

 

 

మొబైల్ మార్కెట్

మొబైల్ మార్కెట్

గ్లోబెల్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇటీవలే 2019 సంవత్సరంలో మొబైల్ మార్కెట్ యొక్క పూర్తి సమాచారం మరియు Q4 యొక్క విశ్లేషణలను విడుదల చేసింది. 2019 నాల్గవ త్రైమాసికంలో ఆపిల్ మొత్తంగా 72.9 మిలియన్ యూనిట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే దక్షిణ కొరియా బ్రాండ్ శామ్సంగ్ 2 వ స్థానంలో నిలిచింది. అయితే చైనాకు చెందిన హువాయి సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు క్షిణించాయి.

 

 

నోకియా బ్రాండ్ మార్కెట్

నోకియా బ్రాండ్ మార్కెట్

అమ్మకంలో పడిపోయిన మరో మొబైల్ బ్రాండ్ హెచ్‌ఎండి గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా సంస్థ. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపిన డేటా ప్రకారం నోకియా ఫిన్నిష్ హ్యాండ్‌సెట్ తయారీదారు 2019 లో 12.9 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు జరిగాయి. 2018 లో 17.59 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ అమ్మకాలతో పోలిస్తే 2019లో సుమారు 27% క్షీణత జరిగింది.

 

 

నోకియా స్మార్ట్‌ఫోన్‌ల sales

నోకియా స్మార్ట్‌ఫోన్‌ల sales

2019లో ఆసక్తికరంగా కంపెనీ 53.49 మిలియన్ ఫీచర్ ఫోన్‌లను రవాణా చేసింది. 2018 లో రవాణా చేయబడిన 64.8 మిలియన్ ఫీచర్ ఫోన్‌లతో పోలిస్తే 17% తక్కువగా ఉంది. త్రైమాసిక ప్రాతిపదికన Q4, 2019 లో రవాణా చేయబడిన ఫీచర్ ఫోన్‌ల సంఖ్య Q4, 2018 లో రవాణా చేయబడిన ఫీచర్ ఫోన్‌లతో పోలిస్తే 1% పెరిగాయి. 2018 లో 15 మిలియన్లు కాగా మరోవైపు 2019 క్యూ 4 లో 2.8 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే నోకియా రవాణా చేసింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 41% క్షీణత.

 

 

Best Mobiles in India

English summary
Nokia 5.2 Smartphone Price and Images Leaked Online : Check Full Details Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X