ఈ రోజు నుంచే నోకియా 5 అమ్మకాలు

ఇండియన్ మార్కెట్లో నోకియా 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను హెఎమ్‌డి గ్లోబల్ కన్ఫర్మ్ చేసింది. ఆగష్లు 15, 2017 నుంచి ఈ ఫోన్‌లు అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో లభమ్యవుతాయని హెఎమ్‌డి గ్లోబల్ తెలిపింది. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.12,899గా ఉంటుంది.

Read More : ఉసురు తీస్తోన్న Blue Whale ఛాలెంజ్, ఇండియాలో మరొకరు ఆత్మహత్య

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5 కలర్ వేరియంట్‌లలో

మాటీ బ్లాక్, స్విలర్, టెంపర్రడ్ బ్లూ ఇంకా కాపర్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రీ-రిజిస్టేషన్స్ జూలై 7 నుంచి అఫ్‌లైన్ మార్కెట్లో జరుగుతున్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్థతిలో ఈ ఫోన్ లను ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తారు.

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

పూర్తిగా న్యూ లుక్‌తో...

నోకియా ఫోన్‌‌లకు మొదటి నుంచి బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్ లాంగ్వేజ్ వెన్నుముకగా నిలుస్తూ వస్తోంది. నోకియా లాంచ్ చేసిన నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్‌లలోనూ మళ్లీ అదే రుజువైంది. Foxconn కంపెనీ నుంచి తయారీ కాబడిన నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా న్యూ లుక్‌తో కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైనింగ్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఆకట్టుకునే విధంగా యూజర్ ఎక్స్‌పీరియన్స్

నోకియా లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్నాయి. కాబట్టి, యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అప్ టు డేట్‌గా ఉంటుంది.

ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌..

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌‌లు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఫోన్‌లలో కనిపించే క్లీన్ ఇంకా నీట్ యూజర్ ఇంటర్‌ఫేస్ గూగుల్ పిక్సల్ ఫోన్ తరహా అనుభూతులను చేరువ చేస్తుంది.

ఈ ట్రిక్ గురించి చాలా మందికి తెలియదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Nokia 5 Goes on Sale Starting Today for Rs.12,899. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting