విడుదలకు సిద్దమవుతోన్న నోకియా 5, నోకియా 3, నోకియా 3310..?

2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సమీపిస్తోన్న నేపథ్యంలో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో భాగంగా నోకియా లాంచ్ చేయబోతోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సామ్‌సంగ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న యాపిల్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు క్లాసిక్ N-సిరీస్ ఫోన్‌ల

ఫిబ్రవరి 27, 2017 నుంచి నుంచి మార్చి 2, 2017 వరకు జరిగే ఈ అంతర్జాతీయ మొబైల్ ఎగ్జిబిషన్‌లో భాగంగా HMD గ్లోబల్ నేతృత్వంలోని నోకియా పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు క్లాసిక్ N-సిరీస్ ఫోన్‌లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

నోకియా 6 తరహాలోనే..

నోకియా ఇప్పటికే తన మొదటి ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ స్మార్ట్‌ఫోన్ నోకియా 6ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. నోకియా 5, నోకియా 3 పేర్లతో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ నౌగట్ స్మార్ట్‌ఫోన్‌లను MWC 2017లో HMD గ్లోబల్ చేయబోబోతంది. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

నోకియా 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి నోకియా 5 స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండబోతున్నాయి.

ధరలు ఎంతంటే..?

మరోవైపు నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఎటువంటి స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో నోకియా 5 స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,134 వరకు, నోకియా 3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,582 వరకు ఉండొచ్చని సమాచారం.

తెరపైకి నోకియా 3310

ఫిబ్రవరి 26న ఏర్పాటు చేసిన MWC ప్రెస్‌మీట్‌లో భాగంగా నోకియా తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు హై-ఎండ్ వేరియంట్ నోకియా 3310 హ్యాండ్‌సెట్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉందట. ఈ ఫోన్ ధర రూ.4,190 వరకు ఉండొచ్చట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 5, Nokia 3 and high-end Nokia 3310 to launch at MWC 2017: prices and specs leaked. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot