నేటి నుంచే నోకియా 5 బుకింగ్స్, ఎలా బుక్ చేసుకోవాలి?
ఈ ఫోన్‌లో కనిపించే క్లీన్ ఇంకా నీట్ యూజర్ ఇంటర్‌ఫేస్ గూగుల్ పిక్సల్ ఫోన్ తరహా అనుభూతులను చేరువ చేస్తుంది.
నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌ను, నేటి నుంచి ప్రీ-ఆర్డర్స్ పై విక్రయించనున్నారు. కేవలం ఆఫ్‌లైన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర రూ.12,899. నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవాలనుకునే యూజర్లు సమీపంలోని నోకియా డీలర్ వద్దకు వెళ్లి ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. బుక్ చేసుకున్న వారికి డెలివరీ ఎప్పుడుంటుందనేది తెలియాల్సి ఉంది.

నోకియా 5 స్పెసిఫికేషన్స్..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

పూర్తిగా న్యూ లుక్‌తో..
నోకియా ఫోన్‌లకు మొదటి నుంచి బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్ లాంగ్వేజ్ వెన్నుముకగా నిలుస్తూ వస్తోంది. నోకియా లాంచ్ చేసిన నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్‌లలోనూ మళ్లీ అదే రుజువైంది. Foxconn కంపెనీ నుంచి తయారీ కాబడిన నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా న్యూ లుక్‌తో కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైనింగ్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది
అది సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం కావొచ్చు, విండోస్ ఆపరేటింగ్ సిస్టం కావొచ్చు. నోకియా మొన్నటి వరకు లాంచ్ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తాజాగా, నోకియా లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్నాయి. కాబట్టి, యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అప్ టు డేట్ గానే ఉంటుంది.

ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్..
ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఫోన్‌లలో కనిపించే క్లీన్ ఇంకా నీట్ యూజర్ ఇంటర్‌ఫేస్ గూగుల్ పిక్సల్ ఫోన్ తరహా అనుభూతులను చేరువ చేస్తుంది.


Click it and Unblock the Notifications