అలరించేందుకు సిద్దం నోకియా జంట పక్షులు

Posted By: Staff

అలరించేందుకు సిద్దం నోకియా జంట పక్షులు

 

ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమమైన మొబైల్ ఫోన్స్‌ని అందించే నోకియా ఇటీవల విడుదల చేసిన నోకియా 500, నోకియా ఆశా 303 మొబైల్స్ గురించిన సమాచారం పాఠకులకు ప్ర్తత్యేకంగా అందించడం జరుగుతుంది.

నోకియా లేటేస్ట్ వర్సన్ సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో నోకియా 500 అనే కొత్త మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడం కోసం నోకియా 500 మొబైల్ స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌‌గా రూపోందిచడం జరిగింది. మల్టీ టాస్కింగ్ పనులు చాలా వేగవంతంగా చేసేందుకుగాను నోకియా 500 మొబైల్‌లో సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌ని పోందుపరచారు. పవర్ పుల్ 1 GHz ARM ప్రాసెసర్ ఉండడం వల్ల ఫెర్పామెన్స్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు.

ఇందులో 5 మెగా ఫిక్సల్ ఉండడం వల్ల ఇమేజెస్‌ చక్కని క్లారిటీతో తీయవచ్చు. దీనితోపాటు హై ఢెఫినేషన్ వీడియో రికార్డింగ్‌కి కూడా సపోర్ట్ చేస్తుందని సమాచారం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 2జిబి మొమొరీ లభిస్తుండగా, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు ఎక్స్ పాండ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. మొమొరీని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి వీడియోలు, ఆడియో సాంగ్స్‌ని అప్ లోడ్ చేసుకోవచ్చు.

ఇక మల్టీమీడియా ఆఫ్షన్స్ విషయానికి వస్తే మార్కెట్లో ఉన్న అన్ని రకాల వీడియో, ఆడియో ఫార్మెట్లను ఇది సపోర్ట్ చేస్తుంది. మొబైల్ పాటు అదనంగా ఎఫ్ ఎమ్ రేడియో, 3.5 mm ఆడియో జాక్ కూడా లభిస్తుంది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయినటువంటి బ్లూటూత్, యుఎస్‌బి సింక్ మొదలగున వాటిని సపోర్ట్ చేస్తుంది. ఇక 2జి ఇంటర్నెట్ టెక్నాలజీలు అయిన జిపిఆర్ ఎస్, ఎడ్జి టెక్నాలజీలను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వైర్ లెస్ టెక్నాలజీగా బాగా పాపులర్ అయిన వై-పై ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

ఈ మొబైల్‌ని మొట్టమొదట నోకియా కంపెనీ యూరోపియన్ మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. అక్కడ దీని ఖరీదు 150 యారోలు. ఇండియన్ కరెన్సీ ప్రకారం నోకియా 500 సుమారుగా రూ 11,000 వరకు ఉండవచ్చునని అంటున్నారు.

నోకియా ఆశా 303 మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ 9,000/-

* మెమరీ: 1 GHz processor

* డిస్ ప్లే : 2.6-inch capacitive touchscreen display, 320 x 240, 256K colors

* కీబోర్డు : QWERTY keypad

* ఇంటర్నల్ మెమెరీ: 170MB internal storage, expandable up to 32GB via microSD

* మెమరీ: 256MB ROM, 128MB RAM

* కెమెరా : 3.2 MP, 2048×1536 pixels, fixed focus camera

* సెకండరీ కెమెరా : VGA recording @ 15fps

* వై - పై: Wi-Fi 802.11 b/g/n

* బ్యాటరీ : Li-Ion 1300 mAh battery

* చుట్టుకొలతలు: 116.5 x 55.7 x 13.9 mm

* బరువు: 99 గ్రాములు

* కలర్స్: Red, Graphite, Silver White, Aqua, Green, Purple

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot