నోకియా కొత్త సింబియన్ అన్నా ఫోన్ 500

By Super
|
Nokia 500
నోకియా ఇండియాలో నాణ్యతకు, నమ్మకానికి మారు పేరు. నోకియా విడుదల చేసేటటువంటి అన్ని రకాల మొబైల్ ఫోన్స్‌లలో కూడా వాడేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ సింబియన్. ఐతే ఇటీవలే నోకియా విడుదల చేసేటటువంటి కొన్ని మొబైల్స్‌లలో సింబియన్ లేటేస్ట్ వర్సన్ సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో నోకియా 500 అనే కొత్త మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌కి ఏమేమి ఫీచర్స్ ఐతే ఉన్నాయో అటువంటి అన్నిరకాల ఫీచర్స్ నోకియా 500కు ఉన్నాయి.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడం కోసం నోకియా 500 మొబైల్ స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌‌గా రూపోందిచడం జరిగింది. మల్టీ టాస్కింగ్ పనులు చాలా వేగవంతంగా చేసేందుకుగాను నోకియా 500 మొబైల్‌లో సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌ని పోందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇందులో పవర్ పుల్ 1 GHz ARM ప్రాసెసర్ ఉండడం వల్ల ఫెర్పామెన్స్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు.

కెమెరా విషయంలో కూడా యూజర్స్ నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదు. కారణం ఇందులో 5 మెగా ఫిక్సల్ ఉండడం వల్ల ఇమేజెస్‌ చక్కని క్లారిటీతో తీయవచ్చు. దీనితోపాటు హై ఢెఫినేషన్ వీడియో రికార్డింగ్‌కి కూడా సపోర్ట్ చేస్తుందని సమాచారం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 2జిబి మొమొరీ లభిస్తుండగా, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు ఎక్స్ పాండ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. మొమొరీని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి వీడియోలు, ఆడియో సాంగ్స్‌ని అప్ లోడ్ చేసుకోవచ్చు.

ఇక మల్టీమీడియా ఆఫ్షన్స్ విషయానికి వస్తే మార్కెట్లో ఉన్న అన్ని రకాల వీడియో, ఆడియో ఫార్మెట్లను ఇది సపోర్ట్ చేస్తుంది. మొబైల్ పాటు అదనంగా ఎఫ్ ఎమ్ రేడియో, 3.5 mm ఆడియో జాక్ కూడా లభిస్తుంది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయినటువంటి బ్లూటూత్, యుఎస్‌బి సింక్ మొదలగున వాటిని సపోర్ట్ చేస్తుంది. ఇక 2జి ఇంటర్నెట్ టెక్నాలజీలు అయిన జిపిఆర్ ఎస్, ఎడ్జి టెక్నాలజీలను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వైర్ లెస్ టెక్నాలజీగా బాగా పాపులర్ అయిన వై-పై ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

ఈ మొబైల్‌ని మొట్టమొదట నోకియా కంపెనీ యూరోపియన్ మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. అక్కడ దీని ఖరీదు 150 యారోలు. అదే ధరకు ఇండియాలో విడుదల చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం నోకియా 500 సుమారుగా రూ 11,000 వరకు ఉండవచ్చునని అంటున్నారు. ప్రస్తుతానికి నోకియా 500కి సంబంధించిన సమాచారం ఇంకా మార్కెట్లోకి నోకియా అఫీసియల్‌గా విడుదల చేయలేదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X