రెండు స్మార్ట్ ఫోన్లను ఒకేసారి లాంచ్ చేసిన హెచ్ఎండి గ్లోబల్ నోకియా
హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది.నోకియా 6.1 ప్లస్ , నోకియా 5.1ప్లస్ పేర్లతో రెండు డివైస్‌లను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది.
హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది.నోకియా 6.1 ప్లస్ , నోకియా 5.1ప్లస్ పేర్లతో రెండు డివైస్‌లను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది.మొదట నోకియా 6.1 ప్లస్ లాంచ్ అవుతున్నట్టు పుకారాలు వినిపించాయి అయితే అందరిని ఆశ్చర్య పరుస్తూ నోకియా 5.1ప్లస్ ను కూడా లాంచ్ చేసింది. అయితే నోకియా 5.1ప్లస్ ధరను ప్రకటించమప్పటికీ నోకియా 6.1 ప్లస్ రూ.15,999 ధరతో ఫ్లిప్ కార్ట్ మరియు నోకియా అధికారిక వెబ్ సైట్ Nokia.com లో లాభించబోతున్నట్టు తెలిపింది.

నోకియా 6.1 ప్లస్ ధర....
నోకియా 6.1 ప్లస్ 4జేబీ ర్యామ్ +64 జీబీ వేరియంట్ తో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 15,999 గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్ కార్ట్ మరియు నోకియా అధికారిక వెబ్ సైట్ Nokia.com లో ఈ నోకియా 6.1 ప్లస్ ను విక్రయించవచ్చు.

నోకియా 5.1 ప్లస్ ధర....
నోకియా 5.1 ప్లస్ ధరను హెచ్ఎండి గ్లోబల్ సంస్థ ప్రకటించినప్పటికీ ఇంచుమించుగా నోకియా 6.1 ప్లస్ ధర ఉండవచ్చు అని తెలుస్తుంది .అయితే వచ్చే నెల అంటే సెప్టెంబర్ లో అదిరిపోయే ఆఫర్లతో మార్కెట్లోకి రాబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి

నోకియా 6.1 ప్లస్ ఫీచర్స్....
5.80 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2280 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్ 4జీబి, స్టోరేజ్ వేరియంట్ 64జీబి, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3060 mAh బ్యాటరీ.

నోకియా 5.1ప్లస్ ఫీచర్స్....
5.86 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (720x 1520పిక్సల్స్) విత్ 2.5డి గ్లాస్ ప్రొటెక్షన్ అండ్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ మంత్లీ ప్యాచ్ అప్‌డేట్స్, మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టా-కోర్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ టెక్నాలజీ, 3060mAh బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్.


Click it and Unblock the Notifications








