షియోమికి దడ పుట్టించిన నోకియా, నిమిషాల్లో అవుట్ ఆఫ్ స్టాక్

హెచ్‌ఎండి గ్లోబల్ నోకియాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని అభిమానులు నిరూపించారు.

|

హెచ్‌ఎండి గ్లోబల్ నోకియాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని అభిమానులు నిరూపించారు. చైనా దిగ్గజం షియోమికి దడ పుట్టిస్తూ అమ్మకాల్లో అదరగొట్టింది. షియోమి స్మార్ట్‌ఫోన్లు సెకన్ల వ్యవధిలో అవుటాఫ్‌ స్టాక్‌ అవుతుండగా.. ఇటు నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లు కూడా అదే రేంజ్‌లో విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా నోకియా 6.1 ప్లస్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాష్‌ సేల్‌కు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి వచ్చిన రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ డివైజ్‌ అవుటాఫ్‌ స్టాక్‌ అయింది. షియోమి ధీటుగా ఇండియా మార్కెట్లో నోకియా ముందు ముందు గట్టి పోటీనిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

భారీ బ్యాటరీ, 8 కెమెరాలు, సంచలనం రేపుతున్న నోకియా 9భారీ బ్యాటరీ, 8 కెమెరాలు, సంచలనం రేపుతున్న నోకియా 9

అవుటాఫ్‌ స్టాక్‌..

అవుటాఫ్‌ స్టాక్‌..

సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వచ్చిన ఈ ఫోన్‌, 12:02 కల్లా అవుటాఫ్‌ స్టాక్‌ బోర్డును పెట్టేసింది. అంటే ఆ మేర డిమాండ్‌తో నోకియా 6.1 ప్లస్‌ను వినియోగదారులు సొంత చేసుకున్నారు.

ఇది మూడో సేల్‌..

ఇది మూడో సేల్‌..

నోకియా 6.1 ప్లస్‌కు ఇది మూడో సేల్‌. తొలి సేల్‌ ఆగస్టు 30న నిర్వహించారు. అప్పుడే వినియోగదారుల నుంచి ఈ ఫోన్‌కు మాంచి డిమాండ్‌ వచ్చింది. అయితే ఈ సేల్‌లో ఎన్ని యూనిట్లను విక్రయానికి ఉంచారో తెలియదు.

10,680 రేటింగ్స్‌, 2,329 రివ్యూలు
 

10,680 రేటింగ్స్‌, 2,329 రివ్యూలు

తొలి సేల్‌కు వచ్చిన మూడు వారాల్లోనే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు వస్తున్న రేటింగ్స్‌, రివ్యూలు చూసి నోకియా పాత వైభవాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే 10,680 రేటింగ్స్‌, 2,329 రివ్యూలు ఫ్లిప్‌కార్ట్‌లో రికార్డయ్యాయి.

తర్వాత సేల్..

తర్వాత సేల్..

కాగా దీని తర్వాత సేల్ సెప్టెంబర్‌ 20న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. కంపెనీ దీని ధరను రూ.15,999గా నిర్ణయించింది.

నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు

నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

5.8 ఇంచుల భారీ డిస్‌ప్లే

5.8 ఇంచుల భారీ డిస్‌ప్లే

నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 5.8 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు.

Best Mobiles in India

English summary
Nokia 6.1 Plus: Taking the fight to the competition more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X