నోకియా 6.1 ప్లస్ vs షియోమీ ఎంఐ ఏ2, రూ.15000 బడ్జెట్‌లో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్?
ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 6.1 ప్లస్ (Nokia 6.1 Plus), షావోమి ఎంఐ ఏ2 (Xiaomi Mi A2)ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికర పోరు నెలకుంది. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 6.1 ప్లస్ (Nokia 6.1 Plus), షావోమి ఎంఐ ఏ2 (Xiaomi Mi A2)ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఏది సెలక్ట్ చేసుకోవాలో అర్థంకాక తికమక పడుతున్నట్లయితే ఈ స్టోరీ మీకో క్లారిటీని ఇస్తుంది.

ముందుగా నోకియా 6.1 ప్లస్ గురించి...
ముందుగా నోకియా 6.1 ప్లస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ నోకియా 6.1కు సక్సెసర్ వెర్షన్‌గా లాంచ్ అయ్యింది. 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ధర రూ.15,999. ఈ ప్రీమియమ్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మిగిలిన స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే, 5.8 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1080×2280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

షియోమీ ఎంఐ ఏ2 గురించి...
ఇక షియోమీ ఎంఐ ఏ2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ ఎంఐ ఏ1కు సక్సెసర్ వెర్షన్‌గా లాంచ్ అయ్యింది. స్టాక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌కు గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ క్రింద కొన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో పాటు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తూనే ఉంటాయి. హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. ఈ ప్రీమియమ్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మిగిలిన స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 18:9 ఫుల్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3010ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రెండు ఫోన్‌ల మధ్య తేడాలు..
ఇంచుమించుగా ఒకే విధమైన ధర ట్యాగ్‌లో లభ్యమవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు, స్పెసిఫికేషన్ప్ పరంగా కాస్త అటుఇటుగా ఉన్నాయి. పనితీరు పరంగా విషయానికి వచ్చేసరికి షావోమి ఎంఐ ఏ2లో నిక్షిప్తం చేసిన స్నాప్‌డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రాసెసర్, నోకియా 6.1 ప్లస్‌లో పొందుపరిచిన స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పోలిస్తే వేగవంతమైన ప్రాసెసింగ్ ను అందించగలుగుతుంది. కెమెరా విషయంలోనూ Mi A2దే పై చేయిగా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఎంఐ ఏ2లో ఏర్పాటు చేసిన 3,010ఎమ్ఏహెచ్ బ్యాటరీ నోకియా 6.1 ప్లస్‌లోని 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పోలిస్తే కొంత వీక్‌గా అనిపిస్తుంది. Mi A2లో ఎక్స్‌ప్యాండబుల్ మెమురీ ఆప్షన్ లేదు. ఇదే సమయంలో 3.5ఎమ్ఎమ్ పోర్ట్ కూడా ఈ ఫోన్‌లో లోపించింది.

తుది నిర్ణయం మీదే..
ఇక ఫైనల్ రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్‌ను కోరుకునే వారికి నోకియా 6.1 ప్లస్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఫోటోగ్రఫీ బాగుండాలనుకునే వారికి ఎంఐ ఏ2ను ఐడియల్ ఛాయిస్‌గా చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications








