నోకియా 6.1 ఇప్పుడు రూ.15,499కే!
బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన నోకియా 6.1 మరోసారి ధర తగ్గింపును అందుకుంది.
బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన నోకియా 6.1 మరోసారి ధర తగ్గింపును అందుకుంది. ఏప్రిల్ , 2018లో లాంచ్ అయిన ఈ నోకియా 6.1 3జీబీ వేరియంట్ ధరను రూ.16,999 నుంచి రూ.15,499కి తగ్గిస్తూ హెచ్‌ఎండి గ్లోబల్ నిర్ణయం తీసుకుంది.నోకియా 6.1 3జీబీ వేరియంట్ లాంచ్ అయిన నెలకే హెచ్‌ఎండి గ్లోబల్ నోకియా 6.1 4జీబీ వేరియంట్ ను కూడా లాంచ్ చేసింది.4 జీబీ వేరియంట్ రూ. 18,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేయగా దీని పై కూడా రూ. 1500 తగ్గించటంతో రూ.17,499 ధరకే ఈ ఫోన్ లభ్యమవుతుంది.నోకియా 6.1 Plus విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో పాత ఫోన్‌లకు సంబంధించి స్టాక్ క్లియర్ చేసుకునేందుకు హెచ్‌ఎండి గ్లోబల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నోకియా 6.1 ఫీచర్స్....
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

ఆఫర్స్.....
ఈ నోకియా 6.1 ను కొనుగోలు చేసిన వారికి మేక్ మై ట్రిప్ లో 25% ఇన్స్టంట్ డిస్కౌంట్ ను హెచ్‌ఎండి గ్లోబల్ ఆఫర్ చేస్తుంది. అదే విధంగా టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ కూడా 2000 క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది కాష్ బ్యాక్ తో పాటు ఎయిర్టెల్ టీవీ ను 31 డిసెంబర్ 2018 వరకు ఉచితంగా subscibe చేసుకోవచ్చు. 12 నెలల యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది దానికోసం Kotak 811 బ్యాంకు లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ప్రారంభ డిపాజిట్ గా రూ.1000 డిపాజిట్ చేయాల్సి వస్తుంది.అలాగే ఈ ఫోన్ ను EMI పద్దతిలో లో కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తుంది హెచ్‌ఎండి గ్లోబల్

నోకియా 6.1ప్లస్ ఫీచర్స్....
5.80 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2280 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్ 4జీబి, స్టోరేజ్ వేరియంట్ 64జీబి, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3060 mAh బ్యాటరీ.


Click it and Unblock the Notifications








