నోకియా 6.2 రిలీజ్... ధర ఎంతో తెలుసా??

|

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ఇండియాలో నోకియా 6.2 ని లాచ్ చేసింది. ఫిన్నిష్ కంపెనీ మొట్టమొదటగా నోకియా 6.2 ను నోకియా 7.2 తో పాటు గత నెలలో IFA 2019 లో ప్రకటించింది. గత నెలలో నోకియా 7.2 ను ఇండియాలో లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు నోకియా 6.2 ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇప్పుడు దీని ధరను కూడా విడుదల చేసింది. చాలా ప్రీమియం డిజైన్‌ను అందించే నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్ కన్నా ఇది కొంచెం చౌకగా ఉంటుంది.

ధరల వివరాలు
 

ధరల వివరాలు

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ నోకియా 6.2 స్మార్ట్‌ఫోన్ ను కేవలం ఒకే ఒక వేరియంట్ 4GBర్యామ్ + 64 GB స్టోరేజ్ ఆప్షన్ లలో రూ.15,999 ధర వద్ద వద్ద విడుదల చేసింది. ఇప్పుడు ఇది అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్ లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులతో కనీసం కొనుగోలు చేస్తే వినియోగదారులకు రూ .2,000 వరకు తగ్గింపు మరియు 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అలాగే హెచ్‌ఎస్‌బిసి కార్డుతో క్యాష్‌బ్యాక్ రూపంలో 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇతర ఆఫర్లలో నో-కాస్ట్ EMI ఆప్షన్ మరియు ఎక్స్ఛేంజ్లో రూ.9,400 వరకు తగ్గింపు ఉన్నాయి. మీరు ఆర్డర్‌ను పికప్ పాయింట్‌కు పెడితే అమెజాన్ ఇండియా అమెజాన్ పే వాలెట్‌కు రూ .15 క్రెడిట్ చేస్తుంది.

వివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లు

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

గత నెలలో IFA 2019 లో హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ నోకియా 6.2 ను మిడ్-రేంజ్ లైనప్‌లో రెండవ స్మార్ట్‌ఫోన్‌గా విడుదల చేశారు. నోకియా 7.2 మాదిరిగా ఇది వెనుకవైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ 223 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, HDR 10 తో 6.3-అంగుళాల LCD డిస్పేను కలిగి ఉంది. ఇది ఎల్లప్పుడూ ఆన్-డిస్ప్లే మోడ్కు మద్దతు ఇస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 636 SoC మరియు అడ్రినో 509 చేత రన్ అవుతుంది. ఇందులో 4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది.అలాగే మెమొరీని 512GB వరకు విస్తరించడానికి ప్రత్యక SD స్లాట్ కూడా ఉంది.

అమెజాన్ దీపావళికి ఇస్తున్న బహుమతి....స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లపై ఓ లుక్ వేయండి

కెమెరా
 

ఇంకా కెమెరాల విషయానికి వస్తే ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 16-మెగాపిక్సెల్ లెన్స్‌తో ఉంటుంది. అలాగే రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ తో మరియు చివరిది 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో జత చేయబడి ఉంటుంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. దీనిని వాటర్‌డ్రాప్ నాచ్ స్టైల్ లోపల ఉంచారు. ఈ స్మార్ట్‌ఫోన్ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ పై ఆధారంగా రన్ అవుతుంది. నోకియా 8.2 కోసం హెచ్‌ఎండి గ్లోబల్ ఆండ్రాయిడ్ 10 ను విడుదల చేసింది. నోకియా 6.2 కూడా త్వరలో అప్డేట్ పొందవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Nokia 6.2 Launched in India: Priced at Rs 15,999

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X