నోకియా 6.2 & నోకియా 7.2 ఫోన్‌ల ధర మీద రూ.3,000 వరకు భారీ తగ్గింపు

|

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ గతంలో ఇండియాలో చాలా రకాల ఫోన్‌లను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ వన్ బ్రాండింగ్ కారణంగా నోకియా బ్రాండింగ్ ఫోన్‌లు మంచి ప్రజాదరణను పొందాయి. అంతేకాకుండా వాటిని ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.

HMD గ్లోబల్

HMD గ్లోబల్ సంస్థ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో నోకియా 6.2 మరియు నోకియా 7.2 యొక్క ధరల మీద ఇప్పుడు రూ.3,500 వరకు తగ్గింపును ప్రకటించారు. ఈ ఫోన్‌లలో నోకియా 6.2 ను రూ.15,999 ధర వద్ద మరియు నోకియా 7.2ను రూ.18,599 ధర వద్ద గత సంవత్సరం సెప్టెంబర్ 2019 లో ఇండియాలో లాంచ్ చేసారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

సెట్-టాప్ బాక్స్‌ల ధరలను మళ్ళి తగ్గించిన టాటా స్కైసెట్-టాప్ బాక్స్‌ల ధరలను మళ్ళి తగ్గించిన టాటా స్కై

నోకియా 6.2 ధరల తగ్గింపు వివరాలు

నోకియా 6.2 ధరల తగ్గింపు వివరాలు

నోకియా 6.2 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి వేరియంట్‌ను ఇండియాలో రూ.15,999 ధర వద్ద లాంచ్ చేసారు. ఇప్పుడు దీని మీద రూ.3,500 వరకు తగ్గింపు పొందడంతో ఇప్పుడు ఇది రూ.12,499 కొత్త ధర వద్ద లభిస్తున్నది.

 

 

షియోమి Mi A3అభిమానులకు శుభవార్త... భారీగా తగ్గిన ధరషియోమి Mi A3అభిమానులకు శుభవార్త... భారీగా తగ్గిన ధర

నోకియా 7.2 ధరల తగ్గింపు వివరాలు

నోకియా 7.2 ధరల తగ్గింపు వివరాలు

అలాగే నోకియా 7.2 యొక్క 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి వేరియంట్‌ను రూ.18,599 ధర వద్ద లాంచ్ చేసారు. ఇప్పుడు దీనిని రూ.15,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇందులోని 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌ కూడా రూ.2,500 తగ్గింపు ధర పొందడంతో ఇప్పుడు దీనిని రూ.17,099 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. కొత్త ధరలతో వీటిని ఇప్పుడు అమెజాన్ మరియు నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

 

 

బ్రహ్మాండమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఒప్పో F15 మొదటి సేల్స్బ్రహ్మాండమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఒప్పో F15 మొదటి సేల్స్

నోకియా 6.2 స్పెసిఫికేషన్స్

నోకియా 6.2 స్పెసిఫికేషన్స్

నోకియా 6.2 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పైతో రన్ అవుతుంది. ఇది 6.3-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డివైస్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 SoC చేత శక్తిని కలిగి ఉండి 4GB RAM తో జత చేయబడి వస్తుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఎఫ్/ 1.8 లెన్స్‌ సెన్సార్‌తో 16MP ప్రైమరీ కెమెరా, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8MP సెకండరీ వైడ్ యాంగిల్ షూటర్ మరియు 5MP డెప్త్ సెన్సార్‌తో మూడవ కెమెరా ఉంటుంది. అలాగే ముందు భాగంలో f/ 2.0 ఎపర్చర్‌తో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, USB టైప్-సి పోర్ట్, జిపిఎస్ మరియు 4G LTE ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ 3,500mAH బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

నోకియా 7.2 స్పెసిఫికేషన్స్

నోకియా 7.2 స్పెసిఫికేషన్స్

ధర తగ్గింపును పొందిన రెండవ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 7.2. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా రన్ అవుతుంది. ఇది 6.3-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డివైస్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 SoCతో మరియు 6GB RAM తో జత చేయబడి వస్తుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ సెన్సార్ మరియు 5MP సెన్సార్‌తో కలిపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 20MPల సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Nokia 6.2, Nokia 7.2 Receives Price Cut Up to RS.3,000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X