బడ్జెట్ ధరకే 4జిబి ర్యామ్‌ నోకియా 6, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..

Written By:

HMD Global తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ నోకియా 6ను ఇండియాలో రిలీజ్ చేసింది. కాగా ఈ ఫోన్ 4జిబి ర్యామ్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ లో ఎక్స్‌క్లూజివ్‌గా ఫిబ్రవరి 20 నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. కాగా గతేడాది నోకియా 6ను 3జిబి ర్యామ్ తో మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆసక్తికర అంశం ఏంటంటే అప్పుడు చైనాలో ఈ ఫోన్ 4జిబి ర్యామ్ తో విడుదలయింది. ఇది జనవరిలో చైనా అనౌన్స్ చేసింది.

6జిబి ర్యామ్‌తో Moto Z2 Force, కేక పుట్టించే ఫీచర్లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 6 ధర

నోకియా 6 ధరను కంపెనీ రూ. 16,999గా నిర్ణయించింది. దీంతో పాటు ఫోన్ లాంచింగ్ సమయంలో రూ. 2 వేల వరకు ఎక్స్ఛేంజ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. కాగా 3జిబి ర్యామ్ ధర రూ.14,999గా ఉంది. కొత్త వేరియెంట్‌లో ఫీచర్లు ఏమీ మారలేదు. 3జీబీ ర్యామ్‌లో ఉన్న ఫీచర్లే దీంట్లోనూ ఉన్నాయి. కాకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీకి బదులుగా 64జీబీని అందిస్తున్నారు.

నోకియా 6 ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రూ. 8 వేలు తగ్గిస్తూ కంపెనీ నిర్ణయం

కాగా ఈమధ్య నోకియా 8, నోకియా 5 ఫోన్లు డిస్కౌంట్ ను అందుకున్న విషయం తెలిసిందే. హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన విషయం విదితమే. అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ లాంచింగ్ సమయంలో రూ.36,999గా నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ పై ఏకంగా రూ. 8 వేలు తగ్గిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు నోకియా 8ను రూ.28,999 ధరకే యూజర్లు కొనుగోలు చేయవచ్చు.

నోకియా 8 ఫీచర్స్‌

5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0

నోకియా 5

ఈ ఫోన్‌తో పాటు నోకియా 5కు చెందిన 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధరను కూడా రూ.1వేయి తగ్గించారు. ఈ ఫోన్ ఇప్పుడు రూ.12,499 ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. కాగా పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ మోడల్ ధర రూ.11,299గా ఉంది.

నోకియా 5 ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 6 4GB RAM Variant Launched in India as a Flipkart Exclusive: Price, Release Date, Specifications More News at Gzbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot