నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 5 ఆసక్తికర ఫీచర్లు

నోకియా నుంచి భారీ అంచనాల మధ్య అనౌన్స్ కాబడిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మార్కెట్ అంచనాలను అందుకుందా..? ఈ ఫోన్ ప్రత్యేకతలేంటి..?

|

నోకియా ఎట్టకేలకు తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 6ను ఆదివారం మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం పై నోకియా 6 ఫోన్ రన్ అవుతుంది. నోకియా నుంచి భారీ అంచనాల మధ్య అనౌన్స్ కాబడిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మార్కెట్ అంచనాలను అందుకుందా..? ఈ ఫోన్ ప్రత్యేకతలేంటి..?

Read More : ఇది జియో సునామీ.. ఒక్క నెలలో 1.96 కోట్ల యూజర్లు

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లేకు 2.5డీ గొరిల్లా గ్లాస్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ డిస్‌ప్లేలో అమర్చిన పోలరైజర్ లేయర్ సన్‌లైట్ కండీషన్‌లలోనూ యూజర్‌కు క్లియర్ కట్ అనుభూతులను చేరువచేయగలదని కంపెనీ చెబుతోంది.

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబి ర్యామ్

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబి ర్యామ్

ధరకు తగ్గట్టుగానే నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 4జీబి ర్యామ్ అలానే 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. ర్యామ్ ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో గేమర్స్ అలానే హెవీ యూజర్స్‌కు ఈ ఫోన్ చక్కటి ఆప్షన్ కావొచ్చు. ఫోన్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్‌ను మరో 64జీబి వరకు పొడిగించుకోవచ్చు.

కెమెరా విభాగం..
 

కెమెరా విభాగం..

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 లెన్స్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందుగా 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను నోకియా నిక్షిప్తం చేసింది. మొత్తానికి ఈ రెండు కెమెరాలు లీఇకో, షియోమీ, వివో బ్రాండ్‌లతో పోటీ పడే విధంగా ఉన్నాయి.

డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లు

డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లు

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో కూడిన డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లతో వస్తోంది. తద్వారా ఈ ఫోన్ నుంచి హైక్వాలిటీ సౌండ్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. అంటే, హైక్వాలిటీ ఆండ్రాయిడ్ అనభూతులను ఈ ఫోన్ ద్వారా ఆస్వాదించవచ్చు.

నిరుత్సాహపరిచే విషయాలు..

నిరుత్సాహపరిచే విషయాలు..

అయితే నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ లో-ఎండ్ కాన్ఫిగరేషన్‌తో నిరుత్సాహపరుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. చైనాకు చెందిన JD.com నోకియా 6 ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ధర 1699 CNY (మన కరెన్సీలో రూ.16,750).

Best Mobiles in India

English summary
Nokia 6 Android Smartphone: 5 Interesting Features.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X