నోకియా 6 దమ్మెంతో చూస్తారా..?
కత్తితో కోసారు, నిప్పుతో కాల్చారు, చేతితో వంచారు
స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఫీచర్ ఫోన్‌లు మరింత మన్నికగాను ధృడంగానూ కనిపిస్తాయి. మన్నికైన ఫీచర్ ఫోన్‌లను రూపొందించటంలో లెజండరీ బ్రాండ్ నోకియాకు పెద్ద పేరే ఉంది. 1990 -2003 సంవత్సరాల మధ్య నోకియా నుంచి విడుదలైన ఫీచర్ ఫోన్‌లు ఏ స్ధాయిలో ప్రపంచ మార్కెట్లను శాసించాయో మనందరికి తెలుసు.
Read More : సంగీతా, బిగ్ సీ స్టోర్‌లలో Redmi Note 4 ఫోన్‌లు
నోకియా నుంచి లాంచ్ అయిన ఫీచర్ ఫోన్‌లు మాత్రమే కాదు స్మార్ట్‌ఫోన్‌లు కూడా అదేస్ధాయిలో పటుత్వాన్ని కలిగి ఉండటం సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు HMD Global అనౌన్స్ చేసిన మూడు నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో నోకియా 6 మాత్రమే మార్కెట్లో దొరుకుతోంది. అది కూడా చైనా మార్కెట్లోనే. 6000 సిరీస్ అల్యుమినియమ్ గ్రేడ్ మెటల్ తో క్రాఫ్ట్ చేయబడిన నోకియా 6 ఫోన్ మరింత మన్నికగాను ధృడంగానూ కనిపిస్తోంది. నోకియా 6 ధృడత్వాన్ని పరిశీలించే క్రమంలో JerryRigEverything అనే యూట్యూబ్ ఛానల్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లను అనేక విధాలుగా పరీక్షించి చూసారు. అయినప్పటికి నోకియా 6 విజయవంతంగా పనిచేస్తోంది. నోకియా 6 డ్యూరబులిటీ టెస్ట్ వీడియో 5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.
నోకియా 6 కేక..

6000 సిరీస్ అల్యుమినియమ్ గ్రేడ్ మెటల్

అనేక విధాలుగా పరీక్షించి చూసారు
నోకియా 6 డ్యూరబులిటీ టెస్ట్ వీడియో

నోకియా 6 స్పెసిఫికేషన్స్


Click it and Unblock the Notifications








