నోకియా 6 చైనాలోనే కాదు, బయట కూడా దొరుకుతోంది

HMD Global తన మొదటి నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడి మార్కెట్లో JD.com ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడుతోన్న నోకియా 6 ఫోన్‌లకు ఆన్‌లైన్ షాపర్లు బ్రహ్మరథం పడుతున్నారు.

Read More : ఇవి పాటిస్తే.. మీ మొబైల్ ఛార్జింగ్ నిమిషాల్లో ఫుల్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు ఫ్లాష్ సేల్స్‌ విజయవంతంగా

ఇప్పటికే రెండు ఫ్లాష్ సేల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న నోకియా 6 మూడవ సేల్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి చైనా మార్కెట్లకు మాత్రమే పరిమితమైన నోకియా 6 త్వరలో ఇతర దేశాల మార్కెట్లలో కూడా లభ్యంకానుందని సమాచారం.

Softpedia వెల్లడించిన వివరాల ప్రకారం

Softpedia వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో Philippines దేశంలో విక్రయించనున్నారు. ఫలిప్పిన్స్‌కు సంబంధించిన Lazada అనే ప్రముఖ రిటైలర్ నోకియా 6 ఫోన్ లను విక్రయించనున్నట్లు సమాచారం.

ధర ఎంతంటే..?

ప్రస్తుతానికి చైనా మార్కెట్లో JD.com నోకియా 6 ఫోన్‌లను 245 డాలర్లకు విక్రయిస్తోంది. ఫిలిప్పిన్ మార్కెట్లో నోకియా 6 ఫోన్ ధర 370 డాలర్లు వరకు ఉండొచ్చని సమాచారం. ప్రత్యేకించి ఫిలిప్పిన్స్ మార్కెట్ కోసం నోకియా 6, వైట్ వేరియంట్‌ను HMD Global సిద్ధం చేసినట్లు సమాచారం.

నోకియా 6 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 6 Finally Goes On Sale Outside Of China!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot