నోకియా 6 ఇప్పుడు రూ.12,999కే!

Posted By: BOMMU SIVANJANEYULU

బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన నోకియా 6 మరోసారి ధర తగ్గింపును అందుకుంది. జూన్, 2017లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధరను రూ.14,999 నుంచి రూ.13,499కి తగ్గిస్తూ హెచ్‌ఎండి గ్లోబల్ కొద్ది రోజల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో రూ.500 తగ్గించటంతో రూ.12,999కే ఈ ఫోన్ లభ్యమవుతోంది. అమెజాన్ ఇండియా స్టోర్‌లో ఈ ఫోన్‌లు ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతున్నాయి. నోకియా 6 (2018) విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో పాత ఫోన్‌లకు సంబంధించి స్టాక్ క్లియర్ చేసుకునేందుకు హెచ్‌ఎండి గ్లోబల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే నోకియా 6 (4జీబీ ర్యామ్) మోడల్ కూడా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. రూ.16,999 ధర‌ట్యాగ్‌తో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో పాటు ఎక్స్‌టెండెడ్ వారంటీ సదుపాయం..
తమ పాత స్మార్ట్‌ఫోన్‌లతో నోకియా 6ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకునే వారికి ఎక్స్‌ఛేంజ్ వాల్యూ క్రింద రూ.10,711 వరకు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఈఎమ్ఐ పద్ధతిలో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు నెలకు రూ.618 చొప్పున చెల్లించి ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై ఏడాది పాటు యాక్సిడెంట్, లిక్విడ్ అలానే స్ర్కీన్ ప్రొటెక్షన్‌ను తీసుకోవాలనుకునే వారు అదనంగా రూ.739 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో వన్ ఇయర్ ఎక్స్‌టెండెడ్ వారంటీ కోరుకునే అదనంగా మరో రూ.749 చెల్లించాల్సి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకం

నోకియా 6 ఇప్పుడు రూ.12,999కే!

నోకియా 6 స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).
6000 సిరీస్ అల్యుమినియమ్ గ్రేడ్ మెటల్‌తో..
నోకియా 6 రఫ్ అండ్ టఫ్.. నోకియా నుంచి లాంచ్ అయిన ఫీచర్ ఫోన్‌లు మాత్రమే కాదు స్మార్ట్‌ఫోన్‌లు కూడా అదేస్ధాయిలో పటుత్వాన్ని కలిగి ఉండటం సంచలనం రేకెత్తిస్తోంది. 6000 సిరీస్ అల్యుమినియమ్ గ్రేడ్ మెటల్ తో క్రాఫ్ట్ చేయబడిన నోకియా 6 ఫోన్ మరింత మన్నికగాను ధృడంగానూ కనిపిస్తోంది.

English summary
HMD Global is expected to launch the Nokia 6 (2018), Nokia 7 Plus and Nokia 8 Sirocco in India at the April 4 event. Given that the launch of the next-generation model is highly anticipated in the country, the original Nokia 6 has received a price cut once again.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot