భారీ ఆఫర్లతో నోకియా 6 అమ్మకాలు, తొలి సేల్‌ రిజిస్ట్రేషన్‌లు క్లోజ్

నోకియా 6 తొలి విక్రయాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. అమెజాన్‌ ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

By Hazarath
|

నోకియా 6 తొలి విక్రయాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. అమెజాన్‌ ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.జూన్‌లో నోకియా 3, నోకియా 5తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. మిగతా రెండు స్మార్ట్‌ఫోన్లు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో విక్రయానికి వచ్చాయి. నోకియా 6 మాత్రం ఈ రోజు వచ్చింది. ఈ ఫోన్‌ లాంచ్‌ ఆఫర్లను కూడా అమెజాన్‌ లిస్టు చేసింది. కాగా దీని ధర 14,999 రూపాయలు.

ఈ ప్రదేశాల్లో సెల్‌ఫోన్ ఉంచడం చాలా ప్రమాదంఈ ప్రదేశాల్లో సెల్‌ఫోన్ ఉంచడం చాలా ప్రమాదం

నోకియా 6 లాంచ్‌ ఆఫర్స్‌

నోకియా 6 లాంచ్‌ ఆఫర్స్‌

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు రూ.1000 అమెజాన్‌ పే బ్యాలెన్స్‌. కిండ్లీ బుక్స్‌పై 80 శాతం తగ్గింపు. మేక్‌మైట్రిప్‌లో రూ.2500 డిస్కౌంట్‌. ఐదు నెలల వ్యవధిలో 45జీబీ ఉచిత డేటా. సోమవారంతోనే ఈ ఫోన్‌ తొలి సేల్‌ రిజిస్ట్రేషన్‌లు క్లోజయ్యాయి. మేట్‌ బ్లాక్‌, సిల్వర్‌, టాంపర్డ్‌ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది.
ఫీచర్ల విషయానికొస్తే

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లేకు 2.5డీ గొరిల్లా గ్లాస్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ డిస్‌ప్లేలో అమర్చిన పోలరైజర్ లేయర్ సన్‌లైట్ కండీషన్‌లలోనూ యూజర్‌కు క్లియర్ కట్ అనుభూతులను చేరువచేయగలదని కంపెనీ చెబుతోంది.

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

4జీబి ర్యామ్ ధరకు తగ్గట్టుగానే నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 4జీబి ర్యామ్ అలానే 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. ర్యామ్ ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో గేమర్స్ అలానే హెవీ యూజర్స్‌కు ఈ ఫోన్ చక్కటి ఆప్షన్ కావొచ్చు. ఫోన్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్‌ను మరో 64జీబి వరకు పొడిగించుకోవచ్చు.

కెమెరా విభాగం..

కెమెరా విభాగం..

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 లెన్స్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందుగా 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను నోకియా నిక్షిప్తం చేసింది. మొత్తానికి ఈ రెండు కెమెరాలు లీఇకో, షియోమీ, వివో బ్రాండ్‌లతో పోటీ పడే విధంగా ఉన్నాయి.

డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లు

డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లు

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో కూడిన డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లతో వస్తోంది. తద్వారా ఈ ఫోన్ నుంచి హైక్వాలిటీ సౌండ్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. అంటే, హైక్వాలిటీ ఆండ్రాయిడ్ అనభూతులను ఈ ఫోన్ ద్వారా ఆస్వాదించవచ్చు.

నోకియా 6 రఫ్ అండ్ టఫ్..

నోకియా 6 రఫ్ అండ్ టఫ్..

నోకియా నుంచి లాంచ్ అయిన ఫీచర్ ఫోన్‌లు మాత్రమే కాదు స్మార్ట్‌ఫోన్‌లు కూడా అదేస్ధాయిలో పటుత్వాన్ని కలిగి ఉండటం సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు HMD Global అనౌన్స్ చేసిన మూడు నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో నోకియా 6 మాత్రమే మార్కెట్లో దొరుకుతోంది. అది కూడా చైనా మార్కెట్లోనే. 6000 సిరీస్ అల్యుమినియమ్ గ్రేడ్ మెటల్ తో క్రాఫ్ట్ చేయబడిన నోకియా 6 ఫోన్ మరింత మన్నికగాను ధృడంగానూ కనిపిస్తోంది.

అనేక విధాలుగు టెస్ట్

అనేక విధాలుగు టెస్ట్

నోకియా 6 ధృడత్వాన్ని పరిశీలించే క్రమంలో JerryRigEverything అనే యూట్యూబ్ ఛానల్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లను అనేక విధాలుగా పరీక్షించి చూసారు. అయినప్పటికి నోకియా 6 విజయవంతంగా పనిచేస్తోంది.

Best Mobiles in India

English summary
Nokia 6 to Go on Sale for First Time in India Today via Amazon: Price, Specifications Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X