ప్రారంభమైన నోకియా 6 సేల్

నోకియా 6 స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన రెండవ ఫ్లాష్ సేల్ అమెజాన్ ఇండియా వేదికగా మరి కాసేపట్లో జరగబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఎన్ని నిమిషాల్లో ముగుస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మొదటి ఫ్లాష్‌సేల్‌ అమెజాన్ ఇండియాలో ఆగష్టు 23న జరిగింది. 

Read More : Redmi సంచలనం, రూ.6999కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సేల్ ప్రారంభమైన ఒకేఒక్క నిమిషంలో

ఈ సేల్ ప్రారంభమైన ఒకేఒక్క నిమిషంలో మొత్తం ఫోన్‌లన్నీ అమ్ముడుపోయినట్లు హెచ్ఎండి గ్లోబల్ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా నోకియా 6 ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు 10 లక్షల మందికి పైగా రిజిస్టర్ అయ్యారు. ఈ సేల్‌లో ఎన్ని ఫోన్‌లు అమ్ముడయ్యాయన్నది తెలియాల్సి ఉంది.

నోకియా 6 సేల్ ఆఫర్స్..

Amazon Pay ద్వారా నోకియా 6ను కొనుగోలు పై అమెజాన్ ప్రైమ్ యూజర్లకు రూ.1000 డిస్కౌంట్‌ను అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. కైండిల్ ఈ-బుక్స్ పై 80% రాయితీ అలానే రూ.2500 మేక్ మై ట్రిప్ డిస్కౌంట్, 45జీబి వొడాఫోన్ ఉచిత 4జీ డేటా వంటి లాంచ్ ఆఫర్స్, ఈ ఫోన్ కొనుగోలు పై సిద్ధంగా ఉన్నాయి.

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్). ధర రూ.14,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 6 to go on sale on Amazon India's website today. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot