రేపటి నుంచే నోకియా 6 అమ్మకాలు, ధర ఎంతంటే..?

చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత నోకియా నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ Nokia 6 చైనా మార్కెట్లో సంచలనాలు రేపుతోంది.

Read More : Root చేసిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను ప్రమాదాల నుంచి కాపాడుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండవ ఫ్లాష్ సేల్ కూడా విజయవంతం...

Nokia 6 ఫొన్‌లకు సంబంధించి జనవరి 26న జరిగిన రెండవ ఫ్లాష్ సేల్ సెకన్ల వ్యవధిలో ముగియటంతో మూడవ ఫ్లాష్ సేల్ కోసం నోకియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చైనాలో జరిగే మూడవ సేల్‌కు సంబంధించిన వివరాలను HMD గ్లోబల్ ఇంకా వెల్లడించలేదు.

రేపటి నుంచి Philippines మార్కెట్లో

ఇప్పటి వరకు చైనా మార్కెట్‌కు మాత్రమే పరిమితమైన నోకియా 6 రేపటి నుంచి Philippines మార్కెట్లో కూడా లభ్యంకాబోతోంది. అక్కడి మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.25,076గా ఉంది.

Lazada అనే ప్రముఖ రిటైలర్

ఫిలిప్పిన్స్‌కు సంబంధించిన Lazada అనే ప్రముఖ రిటైలర్ నోకియా 6 ఫోన్‌లను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఇండియా రిలీజ్ కు సంబంధించిన వివరాలను HMD గ్లోబల్ లేదా నోకియా ఇండియా త్వరలోనే వెల్లడించే అవకాశముందని సమాచారం.

నోకియా 6 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 6 to go on sale in this country today, India launch expected soon. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot