నోకియా 6 ఇండియాలో దొరుకుతోంది, ధర ఎంతో తెలుసా..?

నోకియా కమ్‌బ్యాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 6 ఇప్పటికే చైనా మార్కెట్లో సంచలనం రేపుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి చైనా అలానే ఫిలిప్పిన్స్ మార్కెట్లో జరిగిన ఫ్లాష్ సేల్స్ సెకన్ల వ్యవధిలో ముగియటంతో నోకియా 6 పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది. నోకియా అభిమానుల్లో సిరికొత్త జోష్‌ను నింపుతోన్న ఈ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో దొరుకుతోంది.

నోకియా 6 ఇండియాలో దొరుకుతోంది, ధర ఎంతో తెలుసా..?

Read More : విడుదలకు సిద్దమవుతోన్న నోకియా 5, నోకియా 3, నోకియా 3310..?

అఫీషియల్‌గా కాదండోయ్, అన్‌అఫీషియల్‌గా. నోకియా ఇండియా ఫ్యాన్స్ కోసం eBay India నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ను రూ.32,440 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంచింది. ఫోన్ వాస్తవ ధరతో పోలిస్తే ఈ ధర రెండితలు ఎక్కువే అని చెప్పాలి. ఈ ఫోన్ ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి 25 రోజుల తరువాత డెలివరీ ఉంటుందని ఈబే‌ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

నోకియా 6 ఇండియాలో దొరుకుతోంది, ధర ఎంతో తెలుసా..?

నోకియా 6 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

Read More : లోకల్ బ్రాండ్‌లకు డేంజర్ బెల్స్, చైనాదే ఇండియన్ మార్కెట్!

English summary
Nokia 6 Is Now Available In India!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot