Home
Mobile

మార్కెట్లోకి నోకియా 6, నోకియా 5, నోకియా 3 : పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

నోకియా 6ను కొనుగోలు చేసే అమెజాన్ ప్రైమ్ యూజర్లకు లాంచ్ ఆఫర్ క్రింద రూ.1000 తగ్గింపు...

By Sivanjaneyulu Bommu

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యాయి. నోకియా 6 ధర రూ.14,999. నోకియా 5 ధర రూ.12,999. నోకియా 3 ధర రూ.9,499. నోకియా 6 మోడల్ అమెజాన్‌లో మాత్రమే దొరుకుతుంది. మిగలిన రెండు ఫోన్‌లు ఆఫ్‌లైన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

జూలై 14 నుంచి నోకియా 6 సేల్..

జూలై 14 నుంచి నోకియా 6 సేల్..

నోకియా 6 సేల్ జూలై 14 నుంచి అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌లను కొనుగోలు చేసే అమెజాన్ ప్రైమ్ యూజర్లకు లాంచ్ ఆఫర్ క్రింద రూ.1000 తగ్గింపు లభిస్తుంది. .

జూలై 7న నోకియా 5, జూన్ 16న నోకియా 3

జూలై 7న నోకియా 5, జూన్ 16న నోకియా 3

నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన బుకింగ్స్ జూలై 7 నుంచి, నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన బుకింగ్స్ జూన్16 నుంచి ఆఫ్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

నోకియా 3 స్పెసిఫికేషన్స్..

నోకియా 3 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

Best Mobiles in India

English summary
Nokia 6, Nokia 5, Nokia 3 launched in India starting from Rs.9,499. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X