రూ.15,000కే Nokia 6..?

జూన్ 13న ఇండియాలో లాంచ్ కాబోతోన్న నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఆండ్రాయిడ్ ఫోన్‌లకు సంబంధించి హెచ్‌ఎండి గ్లోబల్ ఇప్పటికే మీడియా ఇన్విటేషన్‌లను పంపించింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నెలకొన్న పోటీ పరస్థితులను బట్టి చూసినట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం నెలకుంది. ఈ నేపథ్యంలో నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ ధరలు ఏ విధంగా ఉండొచ్చు అనే దాని పై మార్కెట్లో వాడీవేడీ చర్చ సాగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 6 ధర రూ.15000 నుంచి రూ.16000 మధ్య

తాజాగా రివీల్ అయిన నోకియా పవర్ యూజర్ రిపోర్ట్ ప్రకారం హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేయబోతోన్న నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఫోన్ ధరలు మరింత కాంపిటీటివ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సైట్ రివీల్ చేసి సమాచారం ప్రకారం నోకియా 3 ధర మార్కెట్లో రూ.9,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో నోకియా 5 ధర రూ.12,000గానూ, నోకియా 6 ధర రూ.15,000 నుంచి రూ.16,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది

నోకియా 6 స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

నోకియా 3 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Nokia 6, Nokia 5, Nokia 3 price details are out ahead of June 13 release. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot